Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాకు బిగ్ షాక్.. ఇంగ్లండ్ పర్యటన నుంచి రిషభ్ పంత్ ఔట్!

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో తీవ్రంగా గాయపడిన రిషభ్ పంత్.. సిరీస్ మొత్తానికి దూరమైనట్లు తెలుస్తోంది. బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో రిషభ్ పంత్ కుడి పాదానికి తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రిషభ్ పంత్ రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి నేరుగా అతని కుడి పాదానికి బలంగా తాకింది. దాంతో తీవ్ర గాయమై రక్త స్రావమైంది.

వెంటనే పంత్‌ను ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్‌లో రిషభ్ పంత్ కుడి కాలి చిటికెన వేలుకు ఫ్రాక్ఛర్ అయినట్లు తేలింది. దాంతో వైద్యులు అతనికి 6 వారాలా విశ్రాంతి తీసుకోవాలని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పంత్ గాయంపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

IND vs ENG 4th Test Big blow for India Rishabh Pant Ruled Out For Remaining England Tests Reports

సిరీస్‌ నుంచి ఔట్..

'రిషభ్ పంత్ ఈ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. గత రాత్రి అతనికి స్కానింగ్ తీయగా.. కుడికాలు చివరి వేలికి ఫ్రాక్చర్ అయింది. అతను మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశాలు లేవు. తీవ్రమైన నొప్పితో పంత్ బాధ పడుతున్నాడు.'అని ఓ జాతీయ ఛానెల్ పేర్కొంది. పెయిన్ కిల్లర్స్ సాయంతో పంత్ బ్యాటింగ్ కొనసాగిస్తాడని అంతా భావించారు. కానీ నిలబడేందుకు కూడా పంత్ ఇబ్బంది పడుతుడున్నాడు. రిషభ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేయనుండగా.. భారత్ 9 మంది బ్యాటర్లతోనే ఆడనుంది.

రిషభ్ పంత్ గాయం నేపథ్యంలో చివరి టెస్ట్‌కు ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే కేఎల్ రాహుల్ రూపంలో మరో వికెట్ కీపర్ జట్టులో ఉన్నాడు. కానీ రాహుల్‌ను బ్యాకప్ వికెట్ కీపర్‌గా టీమిండియా మేనేజ్‌మెంట్ పరిగణలోకి తీసుకుంటుందా? లేదా? అనేది చూడాలి. ఇటీవల ఇషాన్ కిషన్ కౌంటీ క్రికెట్ కూడా ఆడాడు. కాబట్టి బ్యాకప్ వికెట్ కీపర్‌గా తీసుకునేందుకు అతనికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

భారీ స్కోర్ దిశగా టీమిండియా..

ఈ మ్యాచ్‌‌ను టీమిండియా ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్.. 83 ఓవర్లలో 4 వికెట్లకు 264 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(107 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 58), సాయి సుదర్శన్(151 బంతుల్లో 7 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించగా.. కేఎల్ రాహుల్(98 బంతుల్లో 4 ఫోర్లతో 46), రిషభ్ పంత్(48 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 37) విలువైన పరుగులు చేశారు.

కెప్టెన్ శుభ్‌మన్ గిల్(12) విఫలమవ్వగా.. రవీంద్ర జడేజా(19 బ్యాటింగ్), శార్దూల్ ఠాకూర్(19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ రెండు వికెట్లు తీయగా.. క్రిస్ ఓక్స్ ఓ వికెట్ తీసాడు. తీవ్రంగా గాయపడిన రిషభ్ పంత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.

Story first published: Thursday, July 24, 2025, 14:49 [IST]
Other articles published on Jul 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+