IND vs ENG: కొంపముంచిన అత్యుత్సాహం.. టీమిండియా వెనుకంజకు కారణాలివే?

హైదరాబాద్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రీషెడ్యూల్ ఐదో టెస్టులో తొలి మూడు రోజులు చక్కటి ప్రదర్శనతో సిరీస్ విజయం దిశగా అడుగులేసిన భారత్.. మ్యాచ్‌లో అనూహ్యంగా వెనుకబడింది. ఇంగ్లీష్ జట్టు ముందు 378 పరుగుల భారీ లక్ష్యం నిలిపినప్పటికీ.. భారత్‌కు గెలుపు కష్టసాధ్యంగానే కనిపిస్తోంది. జో రూట్ ( 112 బంతుల్లో 9 ఫోర్లతో 76 బ్యాటింగ్), జానీ బెయిర్‌స్టో (87 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 72 బ్యాటింగ్) అద్భుత పోరాటంతో ఆతిథ్య జట్టు విజయం వైపు పరుగులు పెడుతోంది. 7 వికెట్లు చేతిలో ఉన్న ఇంగ్లండ్.. చివరి రోజు విజయానికి ఇంకో 119 పరుగులు చేయాలి. ఈ పరిస్థితుల్లో భారత్ గెలవాలంటే అద్భుతమే జరగాలి.

ఈజీగా గెలుస్తామనే..
అయితే మూడు రోజుల పాటు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ ఒక్కసారిగా డీలా పడటం అభిమానులను ఆశ్చర్యపరిచింది. టీమిండియా స్వయకృతపరాదమే ప్రస్తుత పరిస్థితికి కారణమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా నాలుగో రోజు ఆటలో టీమిండియా బ్యాటింగ్ మరీ పేలవంగా సాగింది. భారీ ఆధిక్యంతో కావాల్సినంత లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచామని, విజయం ఖాయమనే అత్యుత్సాహం టీమిండియా కొంపముంచింది. విజయం తథ్యమనే కాన్ఫిడెన్స్‌తో భారత్ మ్యాచ్‌ను తేలిగ్గా తీసుకున్నట్లు కనిపించింది.

నిర్లక్ష్యపు షాట్లతో..
శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా ఔటైన తీరు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. నిర్లక్ష్యపు షాట్లతో వారు వికెట్ ఇచ్చుకున్నారు. టెయిలండర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ సైతం క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయలేకపోయారు. 350 ప్లస్ టార్గెట్ పెట్టామనే అత్యుత్సాహం భారత బ్యాటర్లలో కనిపించింది. సోమవారం 36.5 ఓవర్లు ఆడిన టీమిండియా మిగిలిన 7 వికెట్లతో 120 పరుగులు మాత్రమే సాధించింది.

పిచ్‌ను సరిగ్గా రీడ్ చేయలేక..
భారత ఆటగాళ్లతో టీమ్‌మేనేజ్‌మెంట్ సైతం పిచ్‌ను రీడ్ చేయడంలో విఫలమైంది. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ చేజింగ్‌లోనే విజయం సాధించింది. ఈ మూడు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ భారత్‌లానే విజయం దిశగా నడిచి చివర్లో చేతులెత్తేసింది. ఈ మూడు టెస్ట్‌ల్లోనూ చివరి రెండు రోజులు పిచ్ పూర్తిగా ఫ్లాట్‌గా మారింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా మెరుగ్గా బ్యాటింగ్ చేసి 400+ టార్గెట్ నిర్దేశిస్తే పరిస్థితులు మరోలా ఉండేవి. కనీసం రెండో సెషన్ ముగిసేవరకు బ్యాటింగ్ చేసినా చివరి సెషన్‌లో ఇంగ్లండ్‌పై ఒత్తిడి ఉండేది.

కొంపముంచిన క్యాచ్ డ్రాప్..
లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్‌ను అడ్డుకోవడంలో టీమిండియా బౌలర్లు విఫలమయ్యారు. ఆ జట్టు బ్యాటర్లు ప్రణాళిక ప్రకారం స్ట్రైక్ రొటేట్ చేస్తూ బ్యాటింగ్ చేశారు. రనరేట్ 4.5కి తగ్గకుండా జాగ్రత్తపడ్డారు. మరోవైపు భారత బ్యాటింగ్ మాత్రం అటు ధాటిగా.. ఇటు డిఫెన్స్ మోడ్‌లోనూ సాగలేదు. ఇక ఇక 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సిరాజ్ బౌలింగ్‌లో బెయిర్‌స్టో ఇచ్చిన సునాయస క్యాచ్‌ను స్లిప్‌లో హనుమ విహారి వదిలేశాడు.
అతను ఇచ్చిన క్యాచ్ పట్టుంటే ఇంగ్లండ్ ఒత్తిడికి గురయ్యేది. రూట్ సైతం ఔటయ్యేవాడు. కానీ విహారి తప్పిదం భారత్ కొంపముంచింది. ఆ తర్వాత మహమ్మద్ షమీ బౌలింగ్‌లో బెయిర్ స్టో ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను పంత్ అందుకోలేకపోయాడు. ఈ రెండు అవకాశాలతో చెలరేగిన బెయిర్ స్టో భారత ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications