Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: బూమ్ బూమ్ బుమ్రా.. బిత్తరపోయిన సెంచరీ హీరో!(వీడియో)

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మరోసారి నిప్పులు చెరిగాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో రోజు ఆట ఆరంభంలోనే ఆ జట్టును దెబ్బతీసాడు. కళ్లు చెదిరే బౌలింగ్‌తో వరుస ఓవర్లలో ముగ్గురు బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు. అతని ధాటికి బెన్ స్టోక్స్(44) హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. సెంచరీ హీరో జోరూట్(104) బిత్తరపోయాడు. క్రిస్ వోక్స్(0) గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. బుమ్రా ధాటికి ఇంగ్లండ్ 20 పరుగుల వ్యవధిలోనే 3 వికెట్లు కోల్పోయింది.

251/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ ఆరంభంలోనే బెన్ స్టోక్స్ వికెట్‌ కోల్పోయింది. జస్‌ప్రీత్ బుమ్రా వేసిన 86వ ఓవర్‌లో స్టోక్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బుమ్రా వేసిన ఈ ఓవర్ రెండో బంతి ఇన్ స్వింగ్ అవ్వగా.. స్టోక్స్ అంచనా వేయడంలో విఫలమయ్యాడు. దాంతో బ్యాట్, ప్యాడ్ గ్యాప్‌ నుంచి దూసుకెళ్లిన బంతిని ఆఫ్ స్టంప్‌ను లేపేసింది. ఈ బంతికి బెన్ స్టోక్స్ షాకయ్యాడు. తన మరుసటి ఓవర్ తొలి బంతికే జోరూట్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

IND vs ENG 3rd Test Jasprit Bumrah s Red-Hot Spell Rattles England Removes Stokes Root Woakes

బుమ్రా ఆఫ్ స్టంప్ లైన్ బాల్ వేయగా.. జోరూట్ కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతిపై లేట్ అవ్వడంతో ఇన్‌సైడ్ ఎడ్జ్‌ అయ్యి వికెట్లను లేపేసింది. దాంతో రూట్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఆ మరుసటి బంతికే క్రిస్ వోక్స్‌ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ముందుగా అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. శుభ్‌మన్ గిల్ రివ్యూ తీసుకొని ఫలితాన్ని సాధించాడు. దాంతో బుమ్రాకు హ్యాట్రిక్ ఛాన్స్ దక్కింది. కానీ మరుసటి బంతిని బ్రైడన్ కార్స్ జాగ్రత్తగా ఆడి బుమ్రా హ్యాట్రిక్ అవకాశాలను నీరుగార్చాడు. ప్రస్తుతం బుమ్రా బౌలింగ్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Story first published: Friday, July 11, 2025, 16:36 [IST]
Other articles published on Jul 11, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+