టీమిండియాకు భారీ షాక్..కేఎల్ రాహుల్ ఔట్!రివ్యూ ఉపయోగపడలేదుగా!లంచ్ సమయానికి భారత్ స్కోర్ ఎంతంటే?

లీడ్స్: ఇంగ్లండ్ జట్టుతో లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ ఔట్ అయ్యాడు. ఇంగ్లండ్ పేసర్ క్రెయిగ్ ఓవర్టన్ వేసిన 19వ ఓవర్ చివరి బంతికి జానీ బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి రాహుల్ పెవిలియన్ చేరాడు. రాహుల్ 54 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. రాహుల్ అనంతరం అంపైర్లు లంచ్ బ్రేక్ ప్రకటించారు. మూడో రోజు భోజన విరామ సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (25) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌కు భారత్ ఇంకా 320 పరుగులు వెనకబడి ఉంది.

రివ్యూ తీసుకుని
మూడో రోజు ఆటలో భారత్ భోజన విరామ సమయానికి వికెట్ కోల్పోయి 34 పరుగులు చేసింది. 19 ఓవర్ల పాటు ఎంతో ఓపికగా ఆడిన కేఎల్ రాహుల్ (8) చివరికి క్రెయిగ్ ఓవర్టన్ బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అంతకుముందు రాహుల్ రివ్యూ తీసుకుని ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఓలి రాబిన్సన్ వేసిన 10వ ఓవర్ నాలుగో బంతి రాహుల్ ప్యాడ్లను తాకడంతో ఇంగ్లీష్ ఆటగాళ్లు అప్పీల్ చేశారు. ఫీల్డ్ ఎంపైర్ వెంటనే ఎల్బీగా ఔట్ ఇచ్చాడు. రాహుల్ రివ్యూ తీసుకోవాలా అనే సందేహంలో ఉండగా.. రోహిత్ శర్మ అతడికి మద్దుతుగా నిలిచాడు. దీంతో రాహుల్ రివ్యూ కోరాడు.

రివ్యూ ఉపయోగపడలేదుగా
రిప్లైలో కేఎల్ రాహుల్ నాటౌట్ అని తేలింది. పిచింగ్ ఔట్ సైడ్ మరియు బంతి వికెట్లను మిస్ అవ్వడంతో థర్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకుని.. రాహుల్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో రాహుల్ ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అంపైర్ నిర్ణయం వెలుబడగానే రోహిత్ శర్మకు రాహుల్ ధన్యవాదాలు చెప్పాడు.
అందుకు రోహిత్ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. లైఫ్ లభించినా రాహుల్ దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. మరో 10 ఓవర్ల పాటు క్రీజులో నిలబడి ఎల్బీగానే పెవిలియన్ చేరాడు. 'రివ్యూ ఉపయోగపడలేదుగా' అంటూ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.
IND vs ENG: భారత్, ఇంగ్లండ్ సిరీస్‌కు రికార్డు వ్యూయర్‌షిప్.. ఇందుకు కారణం ఆ ఒక్కరోజే!!
2015 తర్వాత ఇదే తొలిసారి
అంతకుముందు 132.2 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ 432 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జస్ప్రీత్ బుమ్రా వేసిన 132.2వ బంతికి ఓలి రాబిన్సన్ (0; 15 బంతుల్లో) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అంతకుముందు ఓవర్లో క్రెయిగ్ ఓవర్టన్ (32)ను మొహ్మద్ షమీ పెవిలియన్ చేర్చాడు. దీంతో ఆంగ్లేయులకు 354 పరుగుల ఆధిక్యం దక్కింది. షమీ 4 వికెట్లు పడగొట్టాడు.
భారత్ ఈ మ్యాచులో ఓటమి పాలవ్వకుండా ఉండాలంటే అద్భుతమే జరగాలి. ఇంతకన్నా ఎక్కువ స్కోరైనా చేయాలి. లేదంటే మూడు రోజుల పాటు ఆలౌట్ అవ్వకుండా ఆడాలి. టీమిండియా విదేశాల్లో 131 ఓవర్లకు పైగా ఒక ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేయడం 2015 తర్వాత ఇదే తొలిసారి. అప్పుడు సిడ్నీ టెస్టులో ఏకంగా 152.3 ఓవర్లు ఫీల్డింగ్ చేయడం గమనార్హం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications