Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెంచరీతో చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. కోహ్లీ, సచిన్‌కు దక్కని రికార్డ్

ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ దుమ్మురేపుతున్నాడు. ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో రెండో సెంచరీ నమోదు చేశాడు. లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో సింగిల్ తీసిన రాహుల్.. 176 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో కీలక భాగస్వామ్యాలతో రాహుల్ జట్టును ఆదుకున్నాడు. అయితే సెంచరీ పూర్తయిన వెంటనే షోయబ్ బషీర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కరుణ్ నాయర్‌తో కలిసి రెండో వికెట్‌కు 61 పరుగులు జోడించిన రాహుల్.. రిషభ్ పంత్‌తో నాలుగో వికెట్‌కు 141 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

కోహ్లీ, సచిన్‌కు దక్కని రికార్డ్

క్రికెట్ పుట్టిల్లు లార్డ్స్‌లో రాహుల్‌కు ఇది రెండో సెంచరీ. దాంతో ఓ అరుదైన రికార్డ్‌ను కేఎల్ రాహుల్ తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్‌ల్లో లార్డ్స్ వేదికగా రెండు శతకాలు నమోదు చేసిన తొలి ఆసియా ఓపెనర్‌గా నిలిచాడు. ఈ ఘనతను అందుకున్న రెండో బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. రాహుల్ కంటే ముందు టీమిండియా దిగ్గజ క్రికెటర్ వెంగ్‌సర్కార్ లార్డ్స్ వేదికగా మూడు సెంచరీలు బాదాడు. లార్డ్స్ వేదికగా కేఎల్ రాహుల్ తన తొలి శతకాన్ని 2021లో నమోదు చేశాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా 151 పరుగుల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాలు లార్డ్స్ వేదికగా సెంచరీ అందుకోలేకపోయారు. లార్డ్స్ మైదానంలో భారత్ నుంచి 10 మంది బ్యాటర్లు మాత్రమే సెంచరీలు నమోదు చేసి హానర్ బోర్డులో తమ పేరును లిఖించుకున్నారు.

IND vs ENG 3rd Test Centurion KL Rahul Achieves Historic Milestone at Lord s

లార్డ్స్‌లో సెంచరీ బాదిన భారత ఆటగాళ్ల జాబితా

దిలీప్ వెంగ్ సర్కార్- 3 సెంచరీలు(1979, 1982, 1986)

కేఎల్ రాహుల్: 2 సెంచరీలు(2021, 2025*)

వినూ మన్కడ్: 1 సెంచరీ (1952)

గుండప్ప విశ్వనాథ్: 1 సెంచరీ (1979)

రవి శాస్త్రి: 1 సెంచరీ(1990)

మహమ్మద్ అజారుద్దీన్: 1 సెంచరీ(1990)

సౌరవ్ గంగూలీ: 1 సెంచరీ(1996)

అజిత్ అగార్కర్: 1 సెంచరీ(2002)

రాహుల్ ద్రవిడ్: 1 సెంచరీ(2011)

అజింక్యా రహానే: 1 సెంచరీ(201)


10 సెంచరీలు.. 9 విదేశీ గడ్డపైనే..

ఓవరాల్‌గా కేఎల్ రాహుల్‌కు ఇది 10వ టెస్ట్ సెంచరీ కాగా.. ఇంగ్లండ్ గడ్డపై నాలుగో టెస్ట్ శతకం. దాంతో ఇంగ్లండ్ గడ్డపై మూడు సెంచరీలు సాధించిన తొలి భారత ఓపెనర్‌గా రాహుల్ నిలిచాడు. గ్రేమ్ స్మిత్(5 సెంచరీలు) తర్వాత 2000 నుంచి ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక సెంచరీలు బాదిన విదేశీ ఓపెనర్‌గా రికార్డ్ అందుకున్నాడు. రాహుల్ సాధించిన 10 టెస్ట్ సెంచరీల్లో 9 శతకాలు విదేశీ గడ్డపైనే నమోదు చేయడం గమనార్హం. ఇందులో ఇంగ్లండ్‌ గడ్డపై నాలుగు, దక్షిణాఫ్రికాలో రెండు, ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్‌లలో ఒక్కో సెంచరీలు ఉన్నాయి. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 5 ఇన్నింగ్స్‌లు ఆడిన రాహుల్ 42, 137,2, 55, 100 పరుగులతో రాణించాడు.

Story first published: Saturday, July 12, 2025, 19:15 [IST]
Other articles published on Jul 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+