For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England మూడో వన్డేకు వర్షం అంతరాయం ఉందా? ఓల్డ్ ట్రాఫోర్డ్ వెదర్ రిపోర్ట్ ఏంటంటే?

IND vs ENG 3rd ODI Weather Report: Full Sunny Day Expected At Old Trafford

మాంచెస్టర్: ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా చివరి మ్యాచ్‌కు సిద్దమైంది. బ్యాటింగ్ వైఫల్యంతో లార్డ్స్‌లో ఘోర ఓటమి ఎదుర్కొన్న టీమిండియా ఆదివారం ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం వేదికగా జరిగే చివరి, మూడో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుతో పోటీ పడనుంది. గత పరాజయాన్ని మరిచిపోయి సరికొత్త ఆట చూపెట్టాలని రోహిత్ సేన భావిస్తోంది. టీ20 సిరీస్‌లో చాలా దూకుడుగా బ్యాటింగ్ చేసిన భారత్ సక్సెస్ సాధించింది. కానీ వన్డేలకు వచ్చే సరికి డీలా పడింది.

మళ్లీ అదే జోరులో దూకుడు కనబర్చి వన్డే సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు రెండో వన్డేలో భారీ విజయంతో ఉత్సాహంగా ఉన్న ఇంగ్లండ్ వన్డే సిరీస్ విజయంతో ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ కూడా అభిమానులకు కావాల్సిన మజాను అందించనుంది.

వర్ష గండం ఉందా?

వర్ష గండం ఉందా?

అయితే ఇంగ్లండ్‌లో వాతావరణం ఎప్పుడూ ఎలా ఉంటుందో చెప్పలేం. రిషెడ్యూల్ టెస్ట్‌కు వరుసగా మూడు రోజులు అంతరాయం కలిగించిన వరుణుడు ఆ తర్వాత ఇబ్బంది పెట్టలేదు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు రెండు వన్డేలు సైతం సజావుగా సాగాయి. అలానే మూడో వన్డేకు కూడా వర్ష సూచన లేదని మాంచెస్టర్ వాతావరణ శాఖ పేర్కొంది. లార్డ్స్ మైదానం వేదికగా తొలి మ్యాచ్ జరగనుండగా.. అక్కడ ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదుకానున్నాయి. గరిష్టంగా 28 డిగ్రీలు.. కనిష్టంగా 15 డిగ్రిల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. చాలా ఉక్కపోతగా ఉండనుంది.. వర్షం వచ్చే సూచన అయితే లేదు. 60 శాతం హ్యుమిడిటీ ఉండనుంది.

 పిచ్‌ ఎలా ఉంది?

పిచ్‌ ఎలా ఉంది?

ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ పిచ్‌ సంప్రదాయంగా అయితే బ్యాట్స్‌మెన్‌, బౌలర్లకు సమానంగా సహకరిస్తుంది. ఇక్కడ చివరగా జరిగిన 9 వన్డేల్లో ఎనిమిదిసార్లు మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టే గెలిచింది. ఈ 9 మ్యాచ్‌ల్లో ఆరుసార్లు మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు 290+ స్కోర్లు చేసింది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్‌కు మొగ్గు చూపే అవకాశం ఉంది.

ముఖా ముఖి పోరు..

ముఖా ముఖి పోరు..

ఇప్పటివరకూ ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ మైదానంలో భారత్‌.. ఇంగ్లాండ్‌తో నాలుగు వన్డేలాడి ఒక్క మ్యాచే నెగ్గింది. మూడింట్లో ఆతిథ్య జట్టు గెలిచింది. 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ కూడా ఇదే మైదానం వేదికగా జరగ్గా భారత్‌కు ప్రతికూల ఫలితం ఎదురైంది. ఓవరాల్‌గా వన్డే క్రికెట్లో ఇంగ్లండ్‌తో ముఖాముఖిలో భారత్‌దే కాస్త పైచేయి. ఇప్పటివరకు రెండు జట్లు 105 మ్యాచ్‌ల్లో తలపడగా భారత్‌ 56 విజయాలు సాధించింది. ఇంగ్లండ్ 44 మ్యాచ్‌ల్లో నెగ్గింది. రెండు టైగా ముగిశాయి. మూడు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు.

కోహ్లీ.. ఇప్పుడైనా..

కోహ్లీ.. ఇప్పుడైనా..

సిరీస్‌లో ఇరు జట్ల ఆందోళనా బ్యాటింగ్‌ గురించే. భారత జట్టులో మొదట చెప్పుకోవాల్సింది టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించే. గత కొన్ని రోజులుగా పేలవ ఫామ్‌తో అతను ఇబ్బంది పడుతున్నాడు. గజ్జ గాయంతో తొలి వన్డేకు దూరమైన అతను రెండో వన్డేలో దారుణంగా విఫలమయ్యాడు. గతంలో అతను సెంచరీ చేయట్లేదని బాధపడ్డ అభిమానులు ఇప్పుడు ఒక 50 కొట్టినా చాలని చూస్తున్నారు. మరి ఈ పర్యటనలో తన వైఫల్యాల పరంపరకు చివరి మ్యాచ్‌లో అయినా అతను తెరదించుతాడేమో చూడాలి.

తుది జట్లు (అంచనా)

తుది జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌, ధావన్‌, కోహ్లీ, సూర్యకుమార్‌, పంత్‌, హార్దిక్‌, జడేజా, షమి, బుమ్రా, చాహల్‌, ప్రసిద్ధ్‌/శార్దూల్ ఠాకూర్

ఇంగ్లాండ్‌: రాయ్‌, బెయిర్‌స్టో, రూట్‌, స్టోక్స్‌, బట్లర్‌, లివింగ్‌స్టోన్‌, మొయిన్‌ అలీ, ఒవర్టన్‌, విల్లీ, కార్స్‌, టాప్లీ

Story first published: Sunday, July 17, 2022, 8:25 [IST]
Other articles published on Jul 17, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+