
శార్దుల్ ఔట్
భారత తుది జట్టులో ఒక మార్పు అనివార్యమైంది. స్టార్ పేసర్ శార్దుల్ ఠాకూర్ తొడ కండరాల గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా అతను గాయపడ్డాడు. అయితే తొలి టెస్ట్‌లో నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ స్ట్రాటజీ అద్భుత ఫలితం ఇవ్వడంతో.. ఇప్పుడు ఐదో బౌలర్‌గా స్పిన్నర్ అశ్విన్‌ను ఆడించాలా? లేక పేసర్లు ఇషాంత్, ఉమేశ్‌లో ఎవర్ని తీసుకోవాలి? అనే దానిపై ఎటూ తేల్చుకోలేకపోతున్నది. అయితే లోయరార్డర్ బ్యాటింగ్‌ను బలోపేతం చేయాలంటే కచ్చితంగా అశ్విన్‌కే చోటు దక్కుతుంది. గ్రీన్ టాప్ వికెట్ ఉంటే మాత్రం ఇషాంత్ తుది జట్టులోకి వస్తాడు.
అతని స్థానంలో మరో పేస్ బౌలర్ ఇషాంత్ లేదా ఉమేశ్ లకు అవకాశం ఇవ్వాలనేది టీమ్ మేనేజ్‌మెంట్ ముందున్న ఒక ప్రత్యా మ్నాయం. అయితే ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంతో పోలిస్తే కొంత పొడిగా ఉండే లార్డ్స్ పిచ్‌ను దృష్టిలో ఉంచుకుంటే సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ తుది జట్టులోకి సరిగ్గా సరిపోతాడు. పైగా కొంత బ్యాటింగ్‌ను బలంగా మార్చాలనే కారణంతోనే శార్దుల్‌కు తొలి టెస్టులో అవకాశం దక్కింది. అలా చూస్తే మంచి బ్యాటింగ్ చేయగల నైపుణ్యం ఉన్న అశ్విన్‌వైపే మొగ్గు ఎక్కువగా ఉంది.
ఇక ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తలకు తగిలిన గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. అయితే అతని స్థానంలో గత మ్యాచ్ ఆడిన కేఎల్ రాహుల్ చక్కటి బ్యాటింగ్‌తో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. దాంతో మయాంక్ తన చాన్స్ కోసం మళ్లీ వేచి చూడాల్సిందే. మరోవైపు భయపడినట్లుగానే భారత ప్రధాన బ్యాటింగ్ త్రయం పుజారా, కోహ్లీ, రహానే గత టెస్టులోనూ విఫలమయ్యారు. ఈ ముగ్గురిలో కనీసం ఇద్దరు రాణిస్తే తప్ప భారత్ భారీ స్కోరుకు అవకాశం ఉండదు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూ టీసీ) ఫైనల్లో విఫలమైన బుమ్రా 9 వికెట్లతో మళ్లీ ఫామ్‌లోకి రావడం భారత్‌కు కలిసొచ్చే అంశం. షమీ కూడా కీలక వికెట్లతో సత్తా చాటాడు. వీరికి అశ్విన్ పదునైన స్పిన్ జత కలిస్తే భారత్‌కు ఎదురుండదు.

బ్రాడ్ ఔట్.. అండర్సన్ డౌట్..
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు అతిపెద్ద సవాలు ఎదురుకానుంది. సీనియర్ పేస్ బౌలర్, కెరీర్‌లో 150వ టెస్టు ఆడాల్సి ఉన్న స్టువర్ట్ బ్రాడ్ కాలిపిక్క గాయం కారణంగా మ్యాచ్‌తో పాటు పూర్తిగా సిరీస్‌కే దూరమవ్వగా.. తొడ గాయంతో బాధపడుతున్న అండర్సన్ రెండో టెస్ట్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. 2016 తర్వాత ఈ ఇద్దరు ఒకేసారి మ్యాచ్‌కు దూరం కావడం ఇదే ఫస్ట్ టైమ్. బ్రాండ్ స్థానంలో మార్క్ వుడ్‌ను ఇంగ్లండ్ ఎంపిక చేసింది. పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్ అయిన వుడ్ ఏమాత్రం ప్రభావం చూపుతాడనేది చెప్పలేం.
గాయంతో బాధపడుతున్న అండర్సన్ స్థానంలో ముందు జాగ్రత్తగా సాఖిబ్ మహమూద్‌ను జట్టులోకి తీసుకున్నారు. బ్యాటింగ్‌లో ఇంగ్లండ్ పరిస్థితి మరీ పేలవంగా ఉంది. తొలి టెస్టులో రూట్ ఆదుకోకపోయుంటే ఇంగ్లండ్ ఎప్పుడో కుప్పకూలి చిత్తుగా ఓడిపోయేది. సరిగ్గా చెప్పాలంటే గత కొన్నేళ్లలో ఇంగ్లండ్ బ్యాటింగ్ బృందం స్వదేశంలో ఇంత బలహీనంగా ఎప్పుడూ లేదు. బర్న్స్, సిబ్లీ, క్రాలీ, లారెన్స్... ఇలా అంతా విఫలం కావడంలో ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్ మొయిన్ అలీకి మళ్లీ టెస్టు టీమ్‌లో స్థానం లభించింది. భారత్‌పై మంచి రికార్డు ఉన్న అలీ అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో కూడా ప్రభావం చూపించగలడు. క్రాలీ స్థానంలో హమీద్‌కు చోటు దక్కే అవకాశం ఉంది.

వర్షం ముప్పులేదు..
బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. మంచి ఎండ కాయడంతో పాటు వర్ష సూచన లేకపోవడం సానుకూలాంశం. టాస్ గెలిచిన టీమ్ బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. పిచ్‌పై గడ్డి ఉంటే మాత్రం పేసర్లు చెలరేగనున్నారు.

తుది జట్లు (అంచనా):
భారత్: విరాట్ కోహ్లీ (కెప్టె న్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చేతశ్వర్ పుజారా, అజింక్యా రహానే, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహహ్మద్ సిరాజ్.
ఇంగ్లండ్: జో రూట్, రోరీ బర్న్స్, డామ్ సిబ్లీ, హసీబ్ హమీద్, జానీ బెయిర్‌స్టో, జోస్ బట్లర్, మొయిన్ అలీ, స్యామ్ కరన్, ఓలీ రాబిన్సన్, మార్క్ వుడ్, ఒవర్టన్/సాఖిబ్.


Click it and Unblock the Notifications
