Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG 2nd Test Day 1: మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. జరిగేది ఎన్ని ఓవర్ల ఆటనో?

IND vs ENG 2nd Test Day 1 Weather Report: Will Rain Dominate Today?

లండన్: భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌ను వరుణుడు వదలడం లేదు. తొలి టెస్ట్ ఫలితాన్ని శాసించిన వర్షం.. రెండో టెస్ట్‌కు అంతరాయం కలిగిస్తోంది. దాంతో లార్డ్స్ వేదికగా ప్రారంభం కావాల్సిన మ్యాచ్ ఆలస్యం కానుంది. ఉదయం నుంచి మైదానాన్ని మబ్బులు కమ్మెసాయి. తీరా మ్యాచ్‌ ప్రారంభానికి గంట ముందు వర్షం ప్రారంభమైంది.

దాంతో మైదానాన్ని కవర్లతో కప్పెసారు. ఆ తర్వాత కొంత బ్రేక్ ఇచ్చినా.. కవర్లు తీసిన వెంటనే మళ్లీ మొదలైంది. దాంతో టాస్‌కు ఆలస్యమైంది. వాస్తవానికి అక్కడి వాతావరణ శాఖ ఈ రోజు వర్షం లేదని చెప్పింది. కానీ కాచుకొని కూర్చున్న వరణుడు మ్యాచ్ ప్రారంభ సమయానికి తన ప్రతాపాన్ని చూపెట్టాడు. ప్రస్తుతం బ్రేక్ ఇవ్వడంతో టాస్ వేసారు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది.

ప్రస్తుతానికి బ్రేక్ ఇచ్చినా ఈ రోజు ఎన్ని ఓవర్ల ఆట సాధ్యమవుతందనేదానిపై ఆసక్తి నెలకొంది. రెండో టెస్ట్‌కు టీమిండియాలో ఒకే ఒక మార్పు చోటు చేసుకుంది. గాయపడ్డ శార్థూల్ ఠాకూర్ స్థానంలో ఇషాంత్ శర్మ జట్టులోకి వచ్చాడు. ఒకే ఒక మార్పు మినహా టీమిండియా బృందంలో సమస్యలేమీ లేకపోగా... ఇద్దరు ప్రధాన పేసర్ల గాయాలతో ఇంగ్లండ్‌ ఇబ్బంది పడుతోంది. స్వల్ప బ్యాటింగ్‌ సమస్యను మినహాయిస్తే మొత్తంగా ఇంగ్లండ్‌పై ప్రస్తుతం భారత్‌దే పైచేయిగా కనిపిస్తోంది.

హీరో విజయ్‌‌తో ధోనీ : ఏదైనా భారీ ప్లాన్‌లో ఉన్నారా..(ఫోటోలు)

స్టార్ పేసర్ శార్దుల్‌ ఠాకూర్‌ తొడ కండరాల గాయంతో మ్యాచ్‌ నుంచి తప్పుకున్నాడు. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా అతను గాయపడ్డాడు. అయితే తొలి టెస్ట్‌లో నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ స్ట్రాటజీ అద్భుత ఫలితం ఇవ్వడంతో.. కోహ్లీ దానికే కట్టుబడ్డాడు. ఇంగ్లండ్ జట్టులో అండర్సన్ ఉండడని భావించినా అతనికి అవకాశం దక్కింది. మొయిన్ అలీ, హమీద్, మార్క్ వుడ్ జట్టులోకి రాగా.. బ్రాడ్, లారెన్స్, క్రాలీ ఉద్వాసనకు గురయ్యారు.

ఇక ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ తలకు తగిలిన గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. అయితే అతని స్థానంలో గత మ్యాచ్‌ ఆడిన కేఎల్‌ రాహుల్‌ చక్కటి బ్యాటింగ్‌తో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. దాంతో మయాంక్‌ తన చాన్స్‌ కోసం మళ్లీ వేచి చూడాల్సిందే. మరోవైపు భయపడినట్లుగానే భారత ప్రధాన బ్యాటింగ్‌ త్రయం పుజారా, కోహ్లీ, రహానే గత టెస్టులోనూ విఫలమయ్యారు. ఈ ముగ్గురిలో కనీసం ఇద్దరు రాణిస్తే తప్ప భారత్‌ భారీ స్కోరుకు అవకాశం ఉండదు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూ టీసీ) ఫైనల్లో విఫలమైన బుమ్రా 9 వికెట్లతో మళ్లీ ఫామ్‌లోకి రావడం భారత్‌కు కలిసొచ్చే అంశం. షమీ కూడా కీలక వికెట్లతో సత్తా చాటాడు.

Story first published: Thursday, August 12, 2021, 15:40 [IST]
Other articles published on Aug 12, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+