IND vs ENG: నిరాశపర్చిన వైభవ్.. కొంపముంచిన ఇషాన్ జిడ్డు బ్యాటింగ్!
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో టీమిండియా 191 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. అభిషేక్ శర్మ(24 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 43), ఇషాన్ కిషన్(40 బంతుల్లో 6 ఫోర్లతో 49) రాణించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు చేసింది.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 37), తిలక్ వర్మ(11 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 24 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరణ్(3/33) మూడు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, విల్ జాక్స్, లియామ్ డాసన్ తలో వికెట్ తీసారు.
నిరాశపర్చిన వైభవ్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కింది. వైభవ్ సూర్యవంశీ తనదైన శైలిలో రెండు భారీ సిక్స్‌లతో విరుచుకుపడగా.. అభిషేక్ శర్మ తన ఫామ్‌ను కొనసాగించాడు. దాంతో 4.4 ఓవర్లలో భారత్ 50 పరుగులు పూర్తి చేసుకుంది. పేసర్లను అలవోకగా ఆడుతున్న వైభవ్‌ను కట్టడి చేసేందుకు ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ స్పిన్నర్‌ను బరిలోకి దించి ఫలితాన్ని రాబట్టాడు.

విల్ జాక్స్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన వైభవ్ సూర్యవంశీ(10) స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 50 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. వైభవ్ ఔటైనా.. అభిషేక్ శర్మ తన జోరును కొనసాగించాడు. హాఫ్ సెంచరీ దిశగా సాగిన అతన్ని పవర్ ప్లేలోని లాస్ట్ బాల్‌కు సామ్ కరణ్ క్యాచ్ ఔట్ చేశాడు. దాంతో భారత్ పవర్ ప్లేలో 2 వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది.
ఇషాన్ కిషన్ జిడ్డు బ్యాటింగ్..
శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. అయ్యర్ దూకుడుగా ఆడినా.. ఇషాన్ కిషన్ స్లోగా బ్యాటింగ్ చేశాడు. గత మూడు మ్యాచ్‌ల్లో విఫలమయ్యామనే ఒత్తిడో ఏమో తెలియదు కానీ తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేశాడు. దూకుడుగా ఆడే క్రమంలో డాసన్ బౌలింగ్‌లో అయ్యర్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 65 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
దూకుడుగా ఆడుతాడనుకున్న శివమ్ దూబే(5)నిరాశపర్చగా.. జిడ్డు బ్యాటింగ్‌తో హాఫ్ సెంచరీ దిశగా సాగిన ఇషాన్ కిషన్‌ను సామ్ కరణ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. అనవసర పరుగుకు ప్రయత్నించి అక్షర్ పటేల్(3) రనౌట్ కాగా.. హర్షిత్ రాణా(6)తో కలిసి తిలక్ వర్మ జట్టు స్కోర్‌ను 190 పరుగులకు చేర్చాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన ఆఖరి ఓవర్‌లో వరుసగా 6,6,4 బాదాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

