Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: తెలుగోడికి నో ఛాన్స్..భారత్‌దే బ్యాటింగ్

ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో లీడ్స్ మైదానం వేదికగా ప్రారంభమైన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అన్నాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. హెడింగ్లీ మంచి వికెట్. ఇక్కడ మాకు మెరుగైన రికార్డ్ ఉంది. ఈ పిచ్ కండిషన్స్‌ను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాం. ఈ సిరీస్ కోసం మేం సిద్దంగా ఉన్నాం. కుర్రాళ్లు, సీనియర్ ఆటగాళ్లతో మా జట్టు మిక్స్‌డ్‌‌గా ఉంది. మా జట్టులోని కొందరు ఆటగాళ్లు కౌంటీ క్రికెట్ ఆడారు.గత మూడు రోజులు మేం బాగా సన్నదమయ్యాం. వోక్స్, బ్రైడన్, బషీర్, టోంగ్‌తో సహా నేను బౌలింగ్ చేస్తాను.'అని బెన్ స్టోక్స్ తెలిపాడు.

IND vs ENG 1st Test No Chance For Nitish Kumar Reddy England Opt To Bowl
Photo Credit: BCCI

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని టీమిండియా నయా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. 'మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. ఈ వికెట్‌పై తొలి సెషన్ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం.కానీ ఆ తర్వాత ఈ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుంది. సూర్యుడు కూడా వచ్చాడు. కాబట్టి వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఈ సిరీస్ కోసం మేం అద్భుతంగా సన్నదమయ్యాం. బెకెన్‌హమ్‌లో ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడాం. మా కుర్రాళ్లంతా ఉత్సాహంగా ఉన్నారు. సాయి సదుర్శన్ అరంగేట్రం చేస్తుండగా.. కరుణ్ నాయర్ రీఎంట్రీ ఇచ్చాడు. సాయి మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు. అందరూ ఊహించనట్లుగానే తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కలేదు.అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కు అవకాశం దక్కింది.

తుది జట్లు:

భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషభ్ పంత్(కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ

ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలి పోప్, జోరూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జేమీ స్మిత్(కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్.

Story first published: Friday, June 20, 2025, 15:36 [IST]
Other articles published on Jun 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+