Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: నో కోహ్లీ, రోహిత్.. హాట్‌స్టార్ వ్యూస్ ఢమాల్!

ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌‌ను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం ఏకపక్షంగా సాగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ఈ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించినా.. ఊహించిన ప్రేక్షకాదరణ లభించలేదు.

ప్రత్యక్షంగా మ్యాచ్ చూసేందుకు ఈడెన్ గార్డెన్స్‌కు అభిమానులు పోటెత్తినా.. టీవీ, ఓటీటీల్లో ఈ మ్యాచ్‌‌ను తక్కువ మందే చూశారు. 66 వేల సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈడెన్ గార్డెన్స్ ప్రేక్షకులతో నిండిపోయినా.. అధికారిక బ్రాడ్‌కాస్టర్స్ స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లకు మాత్రం ఆశించిన రీతిలో వ్యూస్ రాలేదు.

IND vs ENG 1st T20I No Kohli and Rohit Disney Plus Hotstar Views Huge Drop

హాట్ స్టార్ రియల్ టైమ్ వ్యూస్.. ఏ దశలోనూ కోటిన్నర ధాటలేదు. సాధారణంగా భారత్ మ్యాచ్‌ను హాట్‌స్టార్ వేదికగా రెండు కోట్లపైనే చూస్తారు. కానీ నిన్నటి మ్యాచ్‌ను గరిష్టంగా కోటిన్నర మంది చూడలేదు. ఇంగ్లండ్ బ్యాటింగ్ సందర్భంగా ఈ సంఖ్య 60-80 లక్షల మధ్యే ఉంది. భారత బ్యాటింగ్ సందర్భంగా కోటి ధాటింది. అభిషేక్ శర్మ విధ్వంసంతో కోటిన్నరకు చేరింది. అంతే తప్పా ఏ దశలోనూ రూ. 2 కోట్ల వ్యూస్ రాలేదు.

టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోవడంతోనే ప్రేక్షకులు ఈ మ్యాచ్‌ను లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం ఈ ఇద్దరూ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. గతంలో ఫ్రీగా మ్యాచ్‌లను ప్రసారం చేసిన హాట్‌స్టార్.. ఇప్పుడు సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటేనే మ్యాచ్‌లను చూసే అవకాశం కల్పిస్తోంది. ఇది కూడా వ్యూస్ తగ్గడానికి కారణమైంది.

జియోసినిమా రాకతో తీవ్రంగా నష్టపోయిన హాట్‌స్టార్.. పోటీని తట్టుకోలేక ఉచితంగా మ్యాచ్‌లను చూసే అవకాశం కల్పించింది. కానీ హాట్ స్టార్, జియోసినిమా సంస్థలు భాగస్వాములుగా మారడంతో ఉచిత ప్రసారాలను ఎత్తేసింది. రెండు వేదికల్లోని కామెంటేటర్స్ ఇప్పుడు ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Story first published: Thursday, January 23, 2025, 13:20 [IST]
Other articles published on Jan 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+