Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: అభిషేక్ శర్మ ఊచకోత.. గంభీర్ రియాక్షన్ వైరల్!

టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ(34 బంతుల్లో 5 ఫోర్లు,8 సిక్స్‌లతో 79) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో కోల్‌కతా వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇంగ్లండ్‌ బౌలర్లపై భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అభిషేక్ శర్మ ఊచకోతతో ఈ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

అయితే 29 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అభిషేక్ శర్మ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను ఆదిల్ రషీద్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో చెలరేగిన అభిషేక్ శర్మ 20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అభిషేక్ హాఫ్ సెంచరీ సాధించిన వెంటనే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. లేచి నిలబడి చప్పట్లతో అభినందించాడు. అభిషేక్ శర్మ బ్యాటింగ్‌‌తో సంతోషానికి గురైన గంభీర్ చిరునవ్వులు చిందించాడు.

IND vs ENG 1st T20I Gautam Gambhir Reaction After Abhishek Sharma s 79 from 34 Goes Viral

సాధారణంగా చాలా సీరియస్‌గా ఉండే గంభీర్.. అభిషేక్ శర్మ బ్యాటింగ్‌కు ఫిదా అయ్యాడు. ప్రస్తుతం గంభీర్ రియాక్షన్ నెట్టింట వైరల్‌గా మారింది. కోచ్ నమ్మకాన్ని అభిషేక్ శర్మ నిలబెట్టుకున్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. గత టీ20 సిరీస్‌లో అభిషేక్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. జింబాబ్వేతో శతకం సాధించిన తర్వాత అభిషేక్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌తో మెరుపు ఇన్నింగ్స్ ఆనంతరం గంభీర్ సంతోషం వ్యక్తం చేశాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68) ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. హ్యారీ బ్రూక్(17), జోఫ్రా ఆర్చర్(12) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్.. అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో 12.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మతో పాటు సంజూ శాంసన్(20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 26), తిలక్ వర్మ(16 బంతుల్లో 3 ఫోర్లతో 19 నాటౌట్) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(2/21) రెండు వికెట్లు తీయగా..ఆదిల్ రషీద్‌కు ఓ వికెట్ దక్కింది.

ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 శనివారం చెన్నై వేదికగా జరగనుంది.

Story first published: Wednesday, January 22, 2025, 22:30 [IST]
Other articles published on Jan 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+