టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ కెరీర్‌లో తొలి 10 మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ సునిల్ గవాస్కర్ ఆల్‌టైమ్ రికార్డను యశస్వి జైస్వాల్ అధిగమించాడు.
బంగ్లాదేశ్‌తో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో యశస్వి జైస్వాల్ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో సత్తా చాటిన యశస్వి జైస్వాల్(56).. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 10 పరుగులకే వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌తో కెరీర్‌లో 10 టెస్ట్‌లు పూర్తి చేసుకున్న యశస్వి జైస్వాల్ 1094 పరుగులు చేశాడు. ఈ క్రమంలో గవాస్కర్(978) రికార్డును అధిగమించాడు. ఓవరాల్‌గా నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు.

టెస్ట్ కెరీర్‌లో తొలి 10 మ్యాచ్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లు..
1.డాన్ బ్రాడ్‌మన్(ఆస్ట్రేలియా)-1446 పరుగులు
2.ఎవర్టన్ వీక్స్(వెస్టిండీస్)-1125 పరుగులు
3.జార్జ్ హెడ్లీ(వెస్టిండీస్)-1102 పరుగులు
4.యశస్వి జైస్వాల్(భారత్)-1094 పరుగులు
5. మార్క్ టేలర్(ఆస్ట్రేలియా)-1088 పరుగులు
ఈ ఏడాది క్యాలెండ్ ఇయర్‌లో టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ప్లేయర్‌గా కూడా యశస్వి జైస్వాల్ నిలిచాడు. బంగ్లాతో తొలి టెస్టు ప్రారంభానికి ముందు నాలుగో స్థానంలో ఉన్న జైస్వాల్ ఇద్దరిని అధిగమించి రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో జో రూట్ (20 ఇన్నింగ్స్‌ల్లో- 986 పరుగులు) ఉన్నాడు.
ఆ తర్వాతి స్థానాల్లో యశస్వీ జైస్వాల్ (13 ఇన్నింగ్స్‌ల్లో- 806 పరుగులు), కామిందు మెండిస్ (10 ఇన్నింగ్స్‌ల్లో- 748 పరుగులు), ఒలీ పోప్ (11 ఇన్నింగ్స్‌ల్లో- 745 పరుగులు) ఉన్నారు. జైస్వాల్ ఇదే జోరు కొనసాగిస్తే రూట్ స్కోరు అధిగమించడం ఖాయమే. బంగ్లాతో రెండు, న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు; ఆస్ట్రేలియాతో జరిగే అయిదు టెస్టుల సిరీస్‌లో నాలుగు టెస్టులను భారత్ ఈ ఏడాదే ఆడనుంది. ఈ మ్యాచ్‌ల్లో జైస్వాల్ రాణిస్తే.. జోరూట్‌ను సునాయసంగా అధిగమిస్తాడు.