Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: అంపైర్లకు క్రీడా స్ఫూర్తి వర్తించదా..?

వన్డే ప్రపంచకప్( World Cup 2023)లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం కంటే కోహ్లీ సెంచరీ అందుకోవడంపైనే ఉత్కంఠ నెలకొంది. ఒక్కో బంతి అభిమాని గుండెను తట్టి లేపింది.

భారత్ విజయానికి 15 పరుగులు కావాల్సిన సమయంలో విరాట్ కోహ్లీ సెంచరీకి 16 పరుగులు అవసరమయ్యాయి. దాంతో పూర్తిగా స్ట్రైకింగ్ తీసుకున్న విరాట్ కోహ్లీ.. క్విక్ డబుల్స్, సింగిల్స్‌తో సెంచరీపై ఆసక్తి రేకెత్తించాడు. చివర్లో భారత్ విజయానికి 2 పరుగులు అవసరం కాగా.. కోహ్లీ సెంచరీ పూర్తవ్వడానికి 3 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

IND vs BAN, World Cup 2023: Is sportsman spirit not applicable to umpires?

దాంతో భారత్ విజయం కంటే కోహ్లీ (Virat Kohli) సెంచరీ చేయడంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పరిస్థితుల్లో 42వ ఓవర్ బౌలింగ్ చేసిన నసుమ్ తొలి బంతిని వైడ్‌గా వేసాడు. దాంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. కానీ ఉద్దేశపూర్వకంగానే నసుమ్ వైడ్ వేసాడని భావించిన అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో తన నిర్ణయాన్ని ప్రకటించలేదు.

ఓవైపు వైడ్ వేసిన బౌలర్‌పై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ కన్నెర్ర చేయగా.. కెటిల్ బరో మాత్రం వైడ్ ఇవ్వకుండా సెంచరీకి సహకరించాడు. ఈ ఓవర్ మూడో బంతిని నసుమ్ ఫుల్‌టాస్ వేయగా.. డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాది విరాట్ శతక గర్జన చేశాడు.

అయితే అంపైర్ వైడ్ ఇవ్వకపోవడంపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత అభిమానులు రిచర్డ్ కెటిల్ బరోను ప్రశంసిస్తుండగా.. ఇతర దేశ అభిమానులు మాత్రం మండిపడుతున్నారు. అయితే ఆటగాళ్లకు ఉండే క్రీడా స్పూర్తి అంపైర్లకు వర్తించదా? అనే కొత్త వాదన ఇప్పుడు తెరపైకి వచ్చింది.

జెంటిల్‌మెన్ గేమ్‌లో అంపైర్లు కూడా క్రీడా స్పూర్తి కనబరిస్తే వచ్చే నష్టం ఏం ఉందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆ బంతి వైడా? కాదా? అనే చర్చను పక్కనపెట్టి.. వైడ్ అయినంత మాత్రానా బంగ్లాదేశ్‌కు జరిగిన నష్టం ఏం ఉంది? ఆ బంతి వైడ్ ఇచ్చినా.. ఇవ్వకున్నా బంగ్లాదేశ్ ఓడుతుంది.

అలాంటి పరిస్థితుల్లో సెంచరీకి చేరువగా ఉన్న ఆటగాడిని అడ్డుకోవాలనే దురుద్దేశంతో బౌలర్ అడ్డదారి‌ని ఎంచుకుంటే.. దాన్ని అంపైర్లు అడ్డుకుంటే అందులో తప్పేం ఉంది? ఓటమి ఖాయమైన తర్వాత ప్రత్యర్థి ఆటగాడి సెంచరీని అడ్డుకుంటే వచ్చే ఆనందం ఏం ఉంటుంది?

విరాట్ కోహ్లీ స్థానంలో మరే ఆటగాడు ఉన్నా.. కెటిల్ బరో స్థానంలో ఇతర అంపైర్ ఉన్నా ఇలా క్రీడా స్పూర్తిని చాటాల్సిందే. ఆటగాళ్లకే కాదు అంపైర్లకు కూడా క్రీడా స్పూర్తి ఉండటంలో తప్పు లేదు. కెటిల్ బరో చేసిన ఈ పని ఆటను మరో స్థాయిని తీసుకెళ్లిందనే విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

Story first published: Friday, October 20, 2023, 16:05 [IST]
Other articles published on Oct 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+