IND vs BAN: ఆ భయంతోనే జట్టులోకి జస్‌ప్రీత్ బుమ్రా!
సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌కు భారత సెలెక్షన్ కమిటీ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. అయితే టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను ఈ సిరీస్‌కు ఎంపిక చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
వచ్చే నాలుగు నెలల్లో టీమిండియా మొత్తం 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. న్యూజిలాండ్‌తో పాటు ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌ల్లో తలపడనుంది. ఈ క్రమంలోనే జస్‌ప్రీత్ బుమ్రాకు బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు రెస్ట్ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా టీమిండియా మేనేజ్‌మెంట్ బుమ్రాను రంగంలోకి దింపింది.

ఆకస్మాత్తుగా బుమ్రాను రంగంలోకి దింపడం వెనుక ఉన్న బలమైన కారణం ఏందనేది చర్చనీయాంశంగా మారింది. అయితే జస్‌ప్రీత్ బుమ్రా కోరిక మేరకే అతన్ని బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేసి ఉంటారని బీసీసీఐకి చెందిన ఓ అధికారి అన్నాడు. 'తన శరీరం గురించి బుమ్రాకే బాగా తెలుస్తోంది. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ ఆడాలా? వద్దా? అనేది అతని నిర్ణయం.'అని చెప్పుకొచ్చాడు.
అయితే బుమ్రాను ఎంపిక చేయడం గురించి మరో వాదన వినిపిస్తోంది. బుమ్రా లేకుండా టీమిండియా తడబడుతుండటంతో మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక పర్యటనలో బుమ్రా లేని టీమిండియా బౌలింగ్ లైనప్ పూర్తిగా తేలిపోయింది. ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. దాంతో ఆతిథ్య శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ కోల్పోయింది.
మరోవైపు బంగ్లాదేశ్ కూడా అసాధారణ ప్రదర్శన కనబరుస్తోంది. పాకిస్థాన్ గడ్డపై వరుసగా రెండు టెస్ట్ మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.
అంతేకాకుండా స్పిన్ బౌలింగ్‌కు భారత బ్యాటర్లు తడబడుతున్నారు. శ్రీలంక పర్యటనలో పూర్తిగా తేలిపోయారు. ఈ క్రమంలోనే బుమ్రాతో బౌలింగ్ లైనప్‌ను పటిష్టం చేసి ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలనేది టీమిండియా మేనేజ్‌మెంట్ యోచన.
తద్వారా భారత బ్యాటర్లకు స్వేచ్చగా ఆడే అవకాశం లభిస్తుందని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఇక బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ చెన్నై వేదికగా జరగనుంది. చెన్నైలోని చెపాక్ మైదానం స్పిన్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. స్పిన్ కండిషన్స్‌లో కూడా బుమ్రా తన పేస్‌తో సత్తా చాటగలడు. అతని ఎంపికకు ఇది కూడా ఓ కారణంగా తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications