బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఘోర తప్పిదం చేశాడు. తన వికెట్ విషయంలో డీఆర్‌ఎస్ తీసుకోకుండా మూల్యం చెల్లించుకున్నాడు. భారత రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే రీప్లేలో బంతి విరాట్ కోహ్లీ బ్యాట్‌ను తాకినట్లు తేలింది. సాధారణంగా రివ్యూ తీసుకునే కోహ్లీ.. ఈ సారి మాత్రం శుభ్‌మన్ గిల్ చెబుతున్నా వినకుండా పెవిలియన్ చేరాడు.
భారత రెండో ఇన్నింగ్స్ సందర్భంగా మెహ్‌దీ హసన్ మీరాజ్ వేసిన 20వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని హసన్ మీరాజ్.. స్టంప్ టూ స్టంప్ వేయగా.. కోహ్లీ అక్రాస్ ది వికెట్ ఆడబోయాడు. కానీ మిస్ టైమ్ అయిన బంతి ప్యాడ్లను తాకింది. వెంటనే మెహ్‌దీ హసన్ అప్పీల్ చేయగా.. అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో ఔటిచ్చాడు.

రివ్యూ తీసుకోవాలని శుభ్‌మన్ గిల్ సూచించినా వినకుండా కోహ్లీ పెవిలియన్ చేరాడు. అయితే రీప్లేలో బంతి.. బ్యాట్‌ను తాకినట్లు స్పష్టమైంది. ఈ వీడియోను చూసి రోహిత్ శర్మ షాకయ్యాడు. తీవ్ర అసహనానికి గురైన అతను రివ్యూ తీసుకోవాల్సింది కదా? అని కోహ్లీతో అన్నాడు. శుభ్‌మన్ గిల్ సైతం అయ్యో అంటూ రియాక్షన్ ఇచ్చాడు. ఫీల్డ్ అంపై రిచర్డ్ కెటిల్ బరో మాత్రం నవ్వుకున్నాడు.
అయితే కోహ్లీ ఎందుకు డీఆర్‌ఎస్ తీసుకోలేదా? అనే చర్చ జోరుగా సాగుతోంది. గతంలో ఎల్బీడబ్ల్యూల విషయంలో కోహ్లీ రివ్యూ తీసుకునేవాడు. ఔట్ అని తెలిసినా కూడా సమీక్షించుకునేవాడు. కానీ ఈ సారి మాత్రం మూడు రివ్యూలు అందుబాటులో ఉన్నా తీసుకునేందుకు సాహసించలేదు. నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు భయపడే కోహ్లీ రివ్యూ తీసుకోలేదని నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు.
కోహ్లీ అక్రాస్‌ది లైన్ ఆడే సమయంలో బంతి ముందుగా బ్యాట్‌కు తాకిందా? ప్యాడ్‌కు తాకిందా? అనే విషయాన్ని పసిగట్టలేకపోయాడు. ఫార్వార్డ్ మూమెంటమ్‌లో ఉండటంతో.. బంతి బ్యాట్‌కు తాకిన విషయాన్ని గుర్తించలేకపోయాడు. పైగా బంతి స్టంప్ టూ స్టంప్ వేయడంతో బ్యాట్‌కు తాకలేదని భావించి రివ్యూ తీసుకోకుండా వెనుదిరిగాడు. అంతే తప్పా గంభీర్‌కు భయపడో.. రివ్యూ వృథా అవుతుందనో అతను అలా చేయలేదు.
విరాట్ కోహ్లీ(17)తో పాటు రోహిత్ శర్మ(5), యశస్వి జైస్వాల్(10) విఫలమైనా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 23 ఓవర్లలో 3 వికెట్లకు 81 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(33 బ్యాటింగ్), రిషభ్ పంత్(12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 308 పరుగులకు చేరింది. అంతకుముందు 339/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు కుప్పకూలింది.
బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహముద్(5/83) ఐదు వికెట్లు తీయగా.. టాస్కిన్ అహ్మద్(3/55) మూడు వికెట్లు పడగొట్టాడు. నహిద్ రాణా, మెహ్‌దీ హసన్ మీరాజ్ తలో వికెట్ తీసారు.అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో బుమ్రా(4/50) నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(2/30), ఆకాశ్ దీప్(2/19), రవీంద్ర జడేజా(2/19) రెండేసి వికెట్లు పడగొట్టారు. దాంతో భారత్ 227 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.