For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Gurnoor Brar: ఎవడ్రా వీడు.. కింగ్ కోహ్లీనే భయపెట్టాడంట..!

ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌కు రంగం సిద్దమైంది. గురువారం(సెప్టెంబర్ 19 )నుంచి చెన్నై వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్ట్‌తో ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌‌కు తెరలేవనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా సన్నదమవుతోంది. నెట్స్‌లో గంటలకొద్దీ ప్రాక్టీస్ చేస్తోంది.

9 నెలల సుదీర్ఘ విరామం తర్వాత రెడ్ బాల్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైన విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌కే ప్రధాన ఆకర్షణగా మారాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నాడు. వ్యక్తిగత కారణాలతో అతను ఈ సిరీస్ ఆడలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అది కూడా సౌతాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు.

IND vs BAN Who is Gurnoor Brar Virat Kohli struggles against 6 5-ft tall speedster in nets

ఈ క్రమంలోనే తన పునరాగమనం ఘనంగా ఉండాలని భావిస్తున్న కోహ్లీ.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. సోమవారం నెట్స్‌లో కోహ్లీ చెమటోడ్చాడు. టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా‌‌ను ఎదుర్కొన్నాడు. బుమ్రా బంతులకు విరాట్ కోహ్లీ కాస్త తడబడినట్లు చెపాక్ మైదాన వర్గాలు పేర్కొన్నాయి. ఇక బుమ్రాతో ఓ నెట్ బౌలర్ కూడా విరాట్ కోహ్లీని ఇబ్బంది పెట్టినట్లు వార్తలు వచ్చాయి.

వరల్డ్ బెస్ట్ బ్యాటర్ అయిన విరాట్ కోహ్లీనే ఇబ్బంది పెట్టిన ఆ నెట్ బౌలర్ ఎవరా? అని క్రికెట్ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. అతని రికార్డ్స్‌ కోసం వెతుకుతున్నారు. అయితే కోహ్లీ ఇబ్బంది పెట్టిన నెట్ బౌలర్ ఎవరో కాదు.. పంజాబ్‌కు చెందిన గుర్నూర్ బ్రార్. 24 ఏళ్ల ఈ యువ పేసర్.. ప్రస్తుతం టీమిండియాకు నెట్‌బౌలర్‌గా సేవలందిస్తున్నాడు.

6.5 అడుగులు ఉండే గుర్నూర్ బ్రార్ బౌలింగ్.. బంగ్లాదేశ్ ప్రధాన పేసర్ నహిద్ రాణా‌ను పోలీ ఉంటుంది. దాంతోనే బీసీసీఐ.. గుర్నూర్ బ్రార్‌ను ఈ సిరీస్‌కు నెట్‌బౌలర్‌గా ఎంపిక చేసింది. సోమవారం నెట్స్‌లో గుర్నూర్ బ్రార్ బౌలింగ్ ఆడిన కోహ్లీ.. అతను వేసిన ఎక్స్‌ట్రా బౌన్స్‌కు ఇబ్బంది పడ్డాడట.ఈ ఆరున్నర అడుగుల ఆజానుబావుడి బౌలింగ్‌ను విరాట్ కోహ్లీ ఫ్రంట్ ఫూట్‌లో ఆడబోయి విఫలమయ్యాడట.

IND vs BAN Who is Gurnoor Brar Virat Kohli struggles against 6 5-ft tall speedster in nets

అయితే దేశవాళీ క్రికెట్‌లో గుర్నూర్ బ్రార్‌కు గొప్ప గణంకాలు ఏవి లేవు. పంజాబ్‌ తరఫున గుర్నూర్ బ్రార్ ఇప్పటి వరకు ఐదు లిస్ట్ ఏ మ్యాచ్‌లతో పాటు ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఆడుతున్న గుర్నూర్ బ్రార్.. ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 42 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ తీయలేదు. లిస్ట్‌-ఏలో 7 వికెట్లు తీసాడు.

అయినా విరాట్ కోహ్లీని తన బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టాడు. దాంతో అతనికి మంచి భవిష్యత్తు ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 'ఎవడ్రా వీడు.. కింగ్ కోహ్లీనే భయపెట్టాడంట..!'అనే మీమ్స్ షేర్ చేస్తున్నారు.

Story first published: Tuesday, September 17, 2024, 10:21 [IST]
Other articles published on Sep 17, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+