ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌కు రంగం సిద్దమైంది. మరో మూడు రోజుల్లో ఈ మెగా సిరీస్‌కు తెరలేవనుంది. సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా సన్నదమవుతోంది. నెట్స్‌లో గంటలకొద్దీ ప్రాక్టీస్ చేస్తోంది.
9 నెలల సుదీర్ఘ విరామం తర్వాత రెడ్ బాల్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైన విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌కే ప్రధాన ఆకర్షణగా మారాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నాడు. వ్యక్తిగత కారణాలతో అతను ఈ సిరీస్ ఆడలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అది కూడా సౌతాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు.

ఈ క్రమంలోనే తన పునరాగమనం ఘనంగా ఉండాలని భావిస్తున్న కోహ్లీ.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. సోమవారం నెట్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ సరదాగా గొడవపడ్డారు. నెట్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ.. అతని బంతులకు తడబడినట్లు తెలుస్తోంది. బుమ్రా వేసిన ఇన్‌స్వింగర్‌ను పసిగట్టలేక విరాట్ కోహ్లీ వికెట్ల ముందు దొరికిపోయాడని ఓ స్పోర్ట్స్ జర్నలిస్ట్ పేర్కొన్నాడు.
ఔట్ అంటూ బుమ్రా అప్పీల్ చేయగా.. నాటౌట్ అని కోహ్లీ వాదించాడట. బంతి డౌన్ ద లెగ్ స్టంప్ పోతుందని చెప్పాడట. కానీ బుమ్రా ఔట్ అని పట్టుబట్టాడు. డీఆర్‌ఎస్ కావాలంటూ సైగలు చేశాడట.
ఇక బుమ్రాతో పాటు 24 ఏళ్ల నెట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ బౌలింగ్‌లోనూ విరాట్ కోహ్లీ తడబడ్డాడట. బంగ్లాదేశ్ పేసర్ నహిద్ రాణా బౌలింగ్ శైలి కలిగి ఉండే గుర్నూర్ బ్రార్.. విరాట్ కోహ్లీని ఎక్స్‌ట్రా బౌన్స్‌తో ఇబ్బంది పెట్టాడట. ఈ 6.5 టాల్ బౌలర్‌ను విరాట్ కోహ్లీ ఫ్రంట్ ఫూట్‌లో ఆడబోయి విఫలమయ్యాడట. నహిద్ రాణా బౌలింగ్‌ను సునాయసంగా ఆడేందుకు గుర్నూర్ బ్రార్‌ను బీసీసీఐ నెట్ బౌలర్‌గా ఎంపిక చేసింది.
పంజాబ్‌కు చెందిన గుర్నూర్ బ్రార్ ఇప్పటి వరకు ఐదు లిస్ట్ ఏ మ్యాచ్‌లతో పాటు ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఆడుతున్న గుర్నూర్ బ్రార్.. ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 42 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ తీయలేదు. లిస్ట్-ఏలో 7 వికెట్లు తీసాడు.