బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌లో దారుణంగా విఫలమైన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. రెండో మ్యాచ్ కోసం సన్నదమవుతున్నాడు. తన బలహీనతలను అధిగమించేందుకు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. శుక్రవారం నుంచి భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే కాన్పూర్ చేరిన టీమిండియా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. బుధవారం కోహ్లీ.. నెట్స్‌లో గంటల కొద్దీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. తనను ఇబ్బంది పెడుతున్న ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ ఆడాడు. లెగ్ స్పిన్‌ను ప్రాక్టీస్ చేశాడు.

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు అక్షర్ పటేల్, అశ్విన్ బౌలింగ్‌ను నెట్స్‌లో ఎదుర్కొన్నాయి. అయితే ఈ ముగ్గురి బౌలింగ్ ఆడేందుకు కోహ్లీ తీవ్రంగా తడబడినట్లు తెలుస్తోంది. చివరకు అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటైనట్లు సమాచారం.
బుమ్రా వేసిన ఔట్ స్వింగర్‌కు కోహ్లీ వద్ద సమాధానం లేదట. ఇలా నాలుగు ఐదు సార్లు బుమ్రా బౌలింగ్‌లో కోహ్లీ ఇబ్బంది పడ్డాడట. కనీసం బంతిని బ్యాట్‌తో టచ్ చేయలేకపోయాడట. అక్షర్ పటేల్ బౌలింగ్‌లోనూ ఇబ్బంది పడ్డాడట. చివరకు అతని బౌలింగ్‌లో ఔటైన్లు సమాచారం. అశ్విన్ కూడా కోహ్లీని ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తోంది.
గతేడాది వెస్టిండీస్ గడ్డపై శతకం సాధించిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత ఒకే ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. భవిష్యత్తు టెస్ట్ సిరీస్‌ల నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావడం చాలా కీలకం. బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌లొ 280 పరుగుల భారీ తేడాతో గెలిచిన టీమిండియా.. సిరీస్ క్లీన్ స్వీప్ చేయడంపై కన్నేసింది.
కాన్పూర్ టెస్ట్‌ను కూడా గెలిచి సిరీస్‌తో పాటు డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని పదిలం చేసుకోవాలనుకుంటుంది. అయితే ఈ రెండో టెస్ట్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.