Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: విరాట్ కోహ్లీ చెత్త రికార్డు.. గత 10 ఇన్నింగ్స్‌ల్లో..!

IND vs BAN: Virat Kohli scripts unwanted record, his test batting average dropped below 49

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో దారుణంగా విఫలమైన విరాట్ కోహ్లీ.. గత 10 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేయలేకపోయాడు. 2014లోనూ ఇలాగే ఇంగ్లాండ్‌తో పది ఇన్నింగ్స్‌ల్లో దారుణంగా విఫలమై విమర్శలు ఎదుర్కొన్నాడు. అప్పుడు అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 39 కావడం గమనార్హం. బంగ్లాదేశ్‌తో టెస్టులకు ముందు వరకు సూపర్ ఫామ్‌లో కనిపించిన విరాట్ కోహ్లీ.. తనకు ఇష్టమైన ఫార్మాట్‌లో విఫలమవడం అభిమానులను కలవరపెడుతోంది.

4 ఇన్నింగ్స్‌ల్లో 45 పరుగులు..

4 ఇన్నింగ్స్‌ల్లో 45 పరుగులు..

తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో 1, 19 పరుగులు మాత్రమే చేసిన విరాట్... ఇక రెండో టెస్టులోనూ విఫలమ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 24 పరుగులు చేయగా.. కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగుకే పెవిలియన్‌కు చేరి నిరాశపరిచాడు.

బంగ్లాదేశ్ బౌలర్‌ మెహదీ హసన్‌ వేసిన ఫ్లైటెడ్‌ డెలివరీని ఆడే క్రమంలో మోమినల్‌ అద్భుత క్యాచ్‌కు ఔటయ్యాడు. బంతి బాగా టర్న్ అవడంతో అంచనా వేయడం విఫలమైన కోహ్లీ మూల్యం చెల్లించుకున్నాడు. కోహ్లీ బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి షార్ట్ లెగ్ ఫీల్డర్ చేతిలో పడింది.

50 కంటే తక్కవ సగటు..

50 కంటే తక్కవ సగటు..

ఈ క్రమంలో టెస్టు ఫార్మాట్‌లో విరాట్ బ్యాటింగ్‌ సగటు 50 కంటే తక్కువకు పడిపోయింది. ప్రస్తుతం 104 టెస్టుల్లో 27 శతకాలు, 28 అర్ధశతకాలతో 8,119 పరుగులను విరాట్ కోహ్లీ సాధించాడు. తన 52వ టెస్టులో యావరేజ్ 50కిపైకి చేరింది. ఇప్పుడు సరిగ్గా 104వ టెస్టు మ్యాచ్‌ సందర్భంగా మరోసారి 50 కంటే కిందికి పడిపోయింది. ప్రస్తుతం 48.91 సగటుతో కొనసాగుతున్నాడు. మరోవైపు వన్డేల్లో 57.47, అంతర్జాతీయ టీ20ల్లో 52.74 సగటుతో ఉన్నాడు.

భారత్ 45/4

భారత్ 45/4

145 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 23 ఓవర్లలో 4 వికెట్లకు 45 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్ పటేల్(26 బ్యాటింగ్), నైట్ వాచ్‌మన్ జయదేవ్ ఉనాద్కత్(3 బ్యాటింగ్) ఉన్నారు. మెహ్‌దీ హసన్ మీరాజ్(3/12) తీన్మార్ వేయడంతో టీమిండియా 37 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఇరు జట్లను ఊరిస్తున్న విజయం..

ఇరు జట్లను ఊరిస్తున్న విజయం..

బంగ్లా స్పిన్ ధాటికి శుభ్‌మన్ గిల్(7), కేఎల్ రాహుల్(2), విరాట్ కోహ్లీ(6), విరాట్ కోహ్లీ(1) క్రీజులో నిలబడలేకపోయారు. భారత్ విజయానికి ఇంకా 100 పరుగులు కావాలి. మరోవైపు బంగ్లా గెలుపునకు 6 వికెట్లు కావాలి. అంతకుముందు 7/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్.. 231 పరుగులకు కుప్పకూలింది. జకీర్ హసన్(51), లిటన్ దాస్(73) హాఫ్ సెంచరీలతో బంగ్లాను ఆదుకున్నారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. అశ్విన్, మహమ్మద్ సిరాజ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనాద్కత్‌కు తలో వికెట్ దక్కింది.

Story first published: Sunday, December 25, 2022, 8:04 [IST]
Other articles published on Dec 25, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+