Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: ఆకాశ్‌దీప్‌‌ను బంతితో కొట్టిన బంగ్లా బౌలర్.. విరగబడి నవ్విన కోహ్లీ-గంభీర్! (వీడియో)

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రెండో రోజు ఆట ఫస్ట్ సెషన్‌లో భారత టెయిలెండర్ ఆకాశ్ దీప్‌ను బంగ్లాదేశ్ బౌలర్ హసన్ మహముద్ బంతితో కొట్టాడు. పరుగుతీసే క్రమంలో వికెట్ల వైపు హసన్ మహముద్ బలంగా బంతిని విసిరేయగా.. ఆకాశ్‌దీప్‌కు తాకింది.

నొప్పితో విలవిలలాడిన ఆకాశ్ దీప్ ఫిజియోల సాయం తీసుకున్నాడు. దాంతో కాసేపు మ్యాచ్ ఆగిపోగా.. డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ విరగబడి నవ్వుకున్నారు. ఆకాశ్ దీప్‌ను బంతితో కొట్టడంపై స్పందిస్తూ కోహ్లీ ఏదో జోక్ వేయగా.. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ఆటగాళ్లంతా నవ్వు ఆపుకోలేకపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

IND vs BAN Virat Kohli-Gautam Gambhir s Reaction Goes Viral after Akash Deep Struck by Wayward Throw

ఆకాశ్‌దీప్ 17 పరుగులు చేసి టస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 91.2 ఓవర్లలో 376 పరుగులు చేసింది. అశ్విన్(113) సెంచరీతో రాణించగా.. జడేజా(86) శతకాన్ని చేజార్చుకున్నాడు.

అనంతరం బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించగా.. ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగారు. ఓపెనర్ షెడ్‌మన్ ఇస్లామ్(2)‌ను బుమ్రా ఔట్ చేయగా.. జకీర్ హసన్(3), మోమినుల్ హక్(0)‌లను ఆకాశ్ దీప్ వరుస బంతుల్లో క్లీన్ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం ఈ వికెట్లకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్(8)ను బుమ్రా ఔట్ చేయగా.. కెప్టెన్ నజ్ముల్ షాంటో(20)ను సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. షకీబ్ అల్ హసన్, లిటన్‌దాస్‌లను జడేజా ఔట్ చేయడంతో బంగ్లాదేశ్ 92 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులో మెహ్‌దీ హసన్ మీరాజ్(10 బ్యాటింగ్), హసన్ మహముద్(9 బ్యాటింగ్) ఉన్నారు.

Story first published: Friday, September 20, 2024, 14:55 [IST]
Other articles published on Sep 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+