Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: 6 ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లీ బౌలింగ్.. సూపరో సూపర్ (వీడియో)

పుణె: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలర్‌గా అవతారమెత్తాడు. 6 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వన్డే ఫార్మాట్‌లో బౌలింగ్ చేశాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో పుణె వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో అనివార్య పరిస్థితుల్లో కోహ్లీ బంతిని అందుకున్నాడు.

స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడటంతో కోహ్లీ బౌలింగ్ చేయాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని లిటన్ దాస్ స్ట్రైట్ డ్రైవ్ ఆడగా.. ఫాలో రనప్‌లో హార్దిక్ పాండ్యా బౌండరీని ఆపే క్రమంలో జారిపడ్డాడు.

IND vs BAN: Virat Kohli bowling in ODIs after 6 years goes viral

దాంతో అతని ఎడమ కాలి మడమకు తీవ్ర గాయమైంది. నొప్పితో విలవిలలాడిన హార్దిక్‌కు టీమిండియా ఫిజియోలు ప్రథమ చికిత్స అందించారు. అయినా అతను నొప్పితో ఇబ్బంది పడుతుండటంతో బయటకు తీసుకెళ్లారు. దాంతో చివరి మూడు బంతులను కెప్టెన్ రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీ‌తో పూర్తి చేయించాడు.

విరాట్ కోహ్లీ బంతి అందుకోగానే.. ప్రేక్షకులంతా గట్టిగా అరుస్తూ అతన్ని ఎంకరేజ్ చేశారు. మూడు బంతులు బౌలింగ్ చేసిన కోహ్లీ 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. గంటకు 103 కిలో మీటర్ల వేగంతో కోహ్లీ బౌలింగ్ చేయగా.. బంగ్లాదేశ్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. జట్టు కోసం ఏం చేసేందుకైనా కోహ్లీ సిద్దమని ఫ్యాన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

విరాట్ కోహ్లీ చివరిసారిగా 2017లో శ్రీలంకతో కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 2 ఓవర్లు వేసిన కోహ్లీ 12 పరుగులు ఇచ్చాడు. 2014లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 ఓవర్లు బౌలింగ్ చేసిన కోహ్లీ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ను ఔట్ చేశాడు. వన్డేల్లో ఇప్పటి వరకు కోహ్లీ 6.22 ఎకానమీతో 4 వికెట్ల తీసాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు తన్జిద్ హసన్(43 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51), లిటన్ దాస్(82 బంతుల్లో 7 ఫోర్లతో 66) శుభారంభాన్ని అందించారు. ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించినా.. క్రీజులో సెట్ అయిన తర్వాత చెలరేగారు.

తొలి వికెట్‌కు 93 పరుగులు జోడించిన అనంతరం తన్జిద్ హసన్‌ను కుల్దీప్ యాదవ్ ఎల్బీగా పెవిలియన్ చేర్చగా.. నజ్ముల్ హోస్సెన్ షాంటో(8)ను జడేజా వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఆ వెంటనే రాహుల్ సూపర్ క్యాచ్‌కు మెహ్‌దీ హసన్(3) వెనుదిరగ్గా.. ధాటిగా ఆడుతున్న లిటన్ దాస్‌ను జడేజా ఔట్ చేశాడు. దాంతో బంగ్లాదేశ్ 137 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది.

Story first published: Thursday, October 19, 2023, 15:57 [IST]
Other articles published on Oct 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+