For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs BAN: కొంపముంచిన రోహిత్.. గట్టెక్కించిన మహమ్మద్ షమీ!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. ఫీల్డర్లు తప్పిదాలు చేసినా అద్భుత బౌలింగ్‌తో బంగ్లాదేశ్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేశారు. ముఖ్యంగా మహమ్మద్ షమీ(5/53) ఐదు వికెట్లతో చెలరేగి తనలోని సత్తా ఇంకా తగ్గలేదని చాటి చెప్పాడు.

అతనికి తోడుగా హర్షిత్ రానా(3/31), అక్షర్ పటేల్(2/43) సత్తా చాటడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు కుప్పకూలింది. టౌహిడ్ హృదయ్(118 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 100) సెంచరీతో ఆఖరి వరకు ఒంటరి పోరాటం చేయగా.. జాకెర్ అలీ(114 బంతుల్లో 4 ఫోర్లతో 68) హాఫ్ సెంచరీతో అతనికి అండగా నిలిచాడు.

IND vs BAN Towhid Hridoy s ton takes Bangladesh to 228 after Mohammed Shami fiffer

కొంపముంచిన రోహిత్..
మహమ్మద్ షమీ, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ సంచలన బౌలింగ్‌తో బంగ్లాదేశ్ 35 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. తొలి పవర్ ప్లేలోనే 5 వికెట్లు కోల్పోవడంతో బంగ్లాదేశ్ 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన తప్పిదం బంగ్లాదేశ్‌కు కలిసొచ్చింది. పీకల్లోతు కష్టాల్లో పడ్డ బంగ్లాదేశ్‌ను టౌహిడ్ హృదయ్, జాకెర్ అలీ అద్భుత బ్యాటింగ్‌తో ఆదుకున్నారు.

భారత ఫీల్డర్ల తప్పిదాలను క్యాష్ చేసుకొని 6వ వికెట్‌కు ఏకంగా 154 పరుగులు జోడించారు. ఎదుర్కొన్న తొలి బంతికే జాకెర్ అలీ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో రోహిత్ శర్మ జారవిడిచాడు. ఈ క్యాచ్ డ్రాప్‌తో అక్షర్ పటేల్‌ హ్యాట్రిక్ వికెట్ కూడా మిస్సయ్యింది. ఈ క్యాచ్ పట్టి ఉంటే జాకెర్ అలీ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.

హార్దిక్ పాండ్యా తప్పిదంతో..
27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జాకెర్ అలీకి మరో లైఫ్ లభించింది. స్టంప్ ఔట్ చేసే అవకాశాన్ని కేఎల్ రాహుల్ వృథా చేశాడు. ఈ అవకాశాలను అందిపుచ్చుకున్న అతను ఏకంగా 68 పరుగులు చేశాడు. మరో బ్యాటర్ టౌహిడ్ హృదయ్ 23 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఇచ్చిన క్యాచ్‌ను మిడాఫ్‌లో హార్దిక్ పాండ్యా వదిలేసాడు. ఈ అవకాశంతో అతను ఏకంగా సెంచరే సాధించాడు.

ఈ జోడీని విడదీసేందుకు రోహిత్ శర్మ చేయని ప్రయత్నం లేదు. చివరకు మహమ్మద్ షమీ.. జాకెర్ అలీని ఔట్ చేసి టీమిండియాకు ఊపిరి అందించాడు. జాకెర్ అలీ ఔటైనా.. టౌహిడ్ హృదయ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఓవైపు క్రాంప్స్‌తో ఇబ్బంది పడినా అద్భుతంగా పోరాడి 114 బంతుల్లో శతకం సాధించాడు. ఆఖరి వికెట్‌గా హర్షిత్ రాణా బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

Story first published: Thursday, February 20, 2025, 18:21 [IST]
Other articles published on Feb 20, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+