For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs BAN: జడేజాకే గోల్డ్ మెడల్.. డ్రెస్సింగ్ రూమ్‌లో రచ్చ రచ్చ ! (వీడియో)

వరల్డ్ కప్ 2023: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బెస్ట్ ఫీల్డర్ అవార్డు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)కే దక్కింది. ఈ అవార్డు రేసులో జడేజాతో పాటు కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ పోటీపడగా.. ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్.. స్టార్ ఆల్‌రౌండర్‌నే ఎంపిక చేశాడు.

ప్రపంచకప్ 2023లో భాగంగా ప్రతీ మ్యాచ్‌లో అద్భుతంగా ఫీల్డింగ్ చేసిన ఆటగాడిని బెస్ట్ ఫీల్డర్‌గా ఎంపిక చేసి గోల్డ్ మెడల్ అందిస్తున్నారు. ఫీల్డ్‌లో మరింత చురుకుగా ఉండేందుకు టీమిండియా మేనేజ్‌మెంట్ ఈ అవార్డు కొత్తగా ప్రవేశపెట్టింది. సూపర్ క్యాచ్‌లతో పాటు పరుగులను నియంత్రించడం, ఫీల్డింగ్‌లో నిలకడ చూపించిన ఆటగాళ్లను ఈ అవార్డుకు ఎంపిక చేస్తున్నారు.

IND vs BAN: Team India celebrates as Ravindra Jadeja gets Gold Medal for best fielder

తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఈ అవార్డు అందుకోగా.. రెండో మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్, మూడో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఈ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా బెస్ట్ ఫీల్డర్‌గా ఎంపికయ్యాడు. ఈ మ్యాచ్‌లో జడేజా ఓ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.

ఆ క్యాచ్ అందుకున్న వెంటనే ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ వైపు చూస్తూ.. గోల్డ్ మెడల్ నాదే అంటూ సైగలు చేశాడు. దాంతో ఈ అవార్డు ఎవరికి దక్కుతుందా? అనే ఉత్కంట నెలకొంది. జడేజాతో పాటు కేఎల్ రాహుల్ కూడా ఓ స్టన్నింగ్ క్యాచ్ అందుకోగా.. కుల్దీప్ యాదవ్ పలు బౌండరీలను అడ్డుకున్నాడు. దాంతో ఈ అవార్డు కోసం త్రిముఖ పోటీ ఏర్పడింది.

ఈ మ్యాచ్ విజయానంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ అవార్డు గురించి మాట్లాడిన కేఎల్ రాహుల్.. 'ఈ రోజు కూడా బెస్ట్ ఫీల్డర్ అవార్డుకు నేను పూర్తి అర్హుడిని. కానీ గత మ్యాచ్‌లోనే నాకు ఈ మెడల్ రావడంతో దిలీప్ సార్‌ మరొకరికి ఇస్తారని భావిస్తున్నా. నా అంచనా ప్రకారం జడేజా ముందు ఉంటాడు. అతను అసాధారణ క్యాచ్ అందుకున్నాడు. కుల్దీప్ యాదవ్ కూడా అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు' అని రాహుల్ చెప్పుకొచ్చాడు.

ఇక కేఎల్ రాహుల్ చెప్పినట్లు ఫీల్డింగ్ కోచ్ దిలీప్ జడేజా పేరు ప్రకటించాడు. 'భారత ఫీల్డర్లు ఈ మ్యాచ్‌లో 13 పరుగులు సేవ్ చేశారు. జడేజా, రాహుల్ సంచలన క్యాచులు అందుకున్నారు. ఒక ఫీల్డర్ అయితే సింహలా కదిలాడు. అతనెవరో కాదు జడేజానే'అని మైదానంలో భారీ స్క్రీన్ మీద జడేజా క్యాచ్ అందుకున్న ఫొటోను ప్రదర్శించారు.

దాంతో టీమిండియా ఆటగాళ్లంతా కేకలు వేస్తూ.. జడేజాను అభినందించారు. కేఎల్ రాహుల్ గోల్డ్ మెడల్‌ను జడేజా మెడలో వేయగా.. అతను దాన్ని తీసుకొని ఫీల్డింగ్ కోచ్ మెడలో వేశాడు.

Story first published: Friday, October 20, 2023, 17:44 [IST]
Other articles published on Oct 20, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+