Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: మయాంక్ యాదవ్ X హర్షిత్ రాణా.. తుది జట్టులో చోటు ఎవరికి?

బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. టీ20 సిరీస్‌కు సన్నదమవుతోంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని యంగ్ ఇండియా.. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే మూడు టీ20ల సిరీస్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. గ్వాలియర్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది.

ఈ సిరీస్‌కు ఐపీఎల్ సెన్సేషన్ మయాంక్ యాదవ్‌తో పాటు హర్షిత్ రాణా ఎంపికయ్యారు. సీనియర్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌తో కలిసి ఈ ఇద్దరూ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ప్రైమ్ పేసర్‌గా అర్ష్‌దీప్ సింగ్ బరిలోకి దిగుతుండగా.. రెండో పేసర్ ఎవరా? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

IND vs BAN T20I Battle of Mayank Yadav and Harshit Rana for 2nd pacer s spot

మయాంక్ X రాణా..
మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా‌లో ఒకరికి మాత్రమే అవకాశం దక్కనుంది. అయితే ఈ ఇద్దరిలో ఎవరూ ఆ అవకాశాన్ని అందుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో సంచలన ప్రదర్శనతో మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా.. టీమిండియా పిలుపును అందుకున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 7 వికెట్లు తీసిన మయాంక్ యాదవ్.. వేగవంతమైన బౌలింగ్‌తో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

దురదృష్టవశాత్తు గాయం కారణంగా అతను మధ్యలోనే టోర్నీ నుంచి తప్పుకున్నాడు. కానీ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేసిన మయాంక్ యాదవ్‌పై టీమిండియా మేనేజ్‌మెంట్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. భవిష్యత్తు స్టార్‌గా తీర్చిదిద్దాలని భావించి.. అతని గాయాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించింది. అప్‌కమింగ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి మయాంక్ యాదవ్‌ను సిద్దం చేయాలనుకుంటోంది. ఈ క్రమంలోనే అతన్ని బంగ్లాతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసింది.

గంభీర్ శిష్యులుగా..
మరోవైపు హర్షిత్ రాణా టైటిల్ గెలిచిన కేకేఆర్ తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 19 వికెట్లతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ప్రదర్శనతో ఇండియా వర్సెస్ శ్రీలంక వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. కానీ తుది జట్టులో చోటు దక్కించుకోలేదు. అయితే మయాంక్ యాదవ్, హర్షిత్ రాణాల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించింది. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీరే.

మరీ ఈ ఇద్దరిలో ఎవరికి ముందుగా అవకాశం ఇస్తాడో అనేది చూడాలి. హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే వంటి పేస్ ఆల్‌రౌండర్లు కూడా ఈ సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఎక్స్‌ట్రా స్పిన్నర్‌తో ఆడితే టీమిండియా అర్ష్‌దీప్ సింగ్‌తో మాత్రమే బరిలోకి దిగనుంది. అప్పుడు హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్ ఇద్దరూ బెంచ్‌కే పరిమితం కానున్నారు.

Story first published: Thursday, October 3, 2024, 16:41 [IST]
Other articles published on Oct 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+