బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దిగింది. విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగించాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. డ్యూ వచ్చే అవకాశం ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ షాంటో స్పష్టం చేశాడు.
'నాకు ముందుగా బౌలింగ్ చేయడం ఇష్టం. పిచ్ కూడా చూడటానికి బాగుంది. రెండో ఇన్నింగ్స్‌లో డ్యూ వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ మైదానంలో జరిగిన అంతర్జాతీయ టీ20లు, ఐపీఎల్ మ్యాచ్‌లను పరిశీలిస్తే.. అన్ని మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఢిల్లీ వేదికగా జరిగిన గత రెండు మ్యాచ్‌ల్లో మాకు విజయం దక్కింది.

ఈ గణంకాలు మా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసాయి. అయితే మేం మా బలాలకు తగ్గట్లు ఆడి అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంది. టాపార్డర్ బ్యాటర్లు దూకుడుగా ఆడాలి. పవర్ ప్లేను సరిగ్గా వాడుకోవాలి. తుది జట్టులో ఒక మార్పు చేశాం. షోరిఫుల్ ఇస్లామ్ స్థానంలో తంజిమ్ షకీబ్ వచ్చాడు.'అని నజ్ముల్ షాంటో చెప్పుకొచ్చాడు.
మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నామని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. 'మేం కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. తొలి మ్యాచ్‌లో ముందుగా బౌలింగ్ చేశాం. గ్రౌండ్స్‌మెన్‌తో మాట్లాడినప్పుడు డ్యూ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. తడి బంతులతో బౌలింగ్ చేయడం మా బౌలర్లకు కఠిన సవాల్. ఏం చేస్తారో చూడాలి.
డ్రెస్సింగ్ రూమ్‌లో అసాధారణ నైపుణ్యం కలిగిన ఆటగాళ్లు ఉన్నారు. ఇది వివరించడానికి చాలా కష్టంగా ఉంది. కానీ కెప్టెన్‌గా నా పని మాత్రం సులువు అవుతోంది. టీ20 ఫార్మాట్ ఆడుతున్నప్పుడు ఒక అడుగు ముందుకేయాలి. పిచ్ చూడటానికి బాగుంది. ఎలా స్పందిస్తుందో చూడాలి. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
బంగ్లాదేశ్: పెర్వెజ్ హోస్సేన్ ఎమోన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హోస్సేన్ షాంటో, టౌహిడ్ హృదయ్, మహ్మదుల్లా, జాకేర్ అలీ, మెహ్‌దీ హసన్ మీరాజ్, రిషద్ హోస్సేన్, టస్కిన్ అహ్మద్, తంజీమ్ హసన్ షకీబ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్.
భారత్: సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తీ, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్.
🚨 Toss Update 🚨
— BCCI (@BCCI) October 9, 2024
Bangladesh win the toss in the 2nd T20I and elect to bowl in Delhi.
Live - https://t.co/Otw9CpO67y#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/3OMaARLaQ0