ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడిపోయింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తాత్కలిక కెప్టెన్ జాకీర్ అలీ బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. తమ కెప్టెన్ లిటన్ దాస్.. నెట్స్‌లో గాయపడ్డాడని, దాంతోనే ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని చెప్పాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. అతను ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడటం దురదృష్టకరం. అందుకే ఈ కీలకమైన మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ మ్యాచ్ కోసం నేను ఉత్సాహంగా ఉన్నాను. మా జట్టు కూడా బాగా ఆడుతోంది. మేం మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. మా జట్టులో నాలుగు మార్పులు చేశాం.'అని జాకీర్ అలీ చెప్పుకొచ్చాడు.

ముందుగా బ్యాటింగ్ చేసేందుకు సిద్దంగా ఉన్నామని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా విన్నింగ్ కాంబినేషన్‌తోనే బరిలోకి దిగుతున్నామని చెప్పాడు.
'మేం ముందుగా బ్యాటింగ్ చేసేందుకు సిద్దంగా ఉన్నాం. గత నాలుగు మ్యాచ్‌ల్లో మేం ఆశించిన ఫలితాలు దక్కాయి. అందుకే ముందుగా బ్యాటింగ్ చేసేందుకు సంతోషంగా ఉన్నాం. గత మ్యాచ్‌ల తరహాలోనే మేం రాణించాల్సిన అవసరం ఉంది. మెరుగైన ప్రదర్శన చేస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయి. మా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. క్యాచ్‌లు నేలపాలు చేయడం ఆటలో భాగం. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. జట్టులో ఎలాంటి మార్పులు లేవు.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
సూపర్-4 భారత్, బంగ్లాదేశ్ ఇప్పటికే చెరొక మ్యాచ్ గెలిచాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ఫైనల్ బెర్త్ దక్కనుంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌లకు నాలుగు గెలిచింది.
భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
బంగ్లాదేశ్: సైఫ్ హసన్, తాంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, జాకర్ అలీ(కీపర్), మహ్మద్ సైఫుద్దీన్, రిషాద్ హుస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్.