Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: రోహిత్ శర్మ మార్క్ కెప్టెన్సీ.. ఉచ్చులో పడిన సెంచరీ హీరో!(వీడియో)

టీమిండియా సారథి రోహిత్ శర్మ మరోసారి తనకు మార్క్ కెప్టెన్సీ‌తో ఆకట్టుకున్నాడు. బంగ్లాదేశ్‌తో కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో తన వ్యూహంతో ప్రత్యర్థి బ్యాటర్‌, ఫస్ట్ ఇన్నింగ్స్ సెంచరీ హీరో మోమినల్ హక్‌ను బుట్టలో వేసుకున్నాడు. అశ్విన్ సాయంతో అతనికి చెక్ పెట్టాడు. ఇక రోహిత్ బిగించిన ఉచ్చును పసిగట్టలేకపోయిన మోమినల్ హక్ మూల్యం చెల్లించుకున్నాడు. 8 బంతుల్లో 2 పరుగులే చేసి వెనుదిరిగాడు.

అసలేం జరిగిందంటే..?
చివరి రోజు ఆట ఫస్ట్ సెషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 26/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన బంగ్లాదేశ్.. ఆచితూచి ఆడే ప్రయత్నం చేసింది. బుమ్రా బౌలింగ్‌ను డిఫెన్స్ చేస్తుండటంతో రోహిత్.. అశ్విన్‌ను రంగంలోకి దింపాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన మోమినల్ హక్.. స్వీప్ షాట్స్ ఎక్కువగా ఆడినట్లు గుర్తించిన రోహిత్.. అందుకు తగ్గట్లుగానే ఫీల్డింగ్ సెట్ చేసి ఫలితాన్ని రాబట్టాడు.

IND vs BAN Sunil Gavaskar hails Rohit Sharma captaincy for Mominul Haque dismissal in Kanpur Test

లెగ్ స్లిప్ ఫీల్డర్‌ను పెట్టి మోమినల్ హక్‌ను పెవిలియన్ చేర్చాడు. రవిచంద్రన్ అశ్విన్ వేసిన 14వ ఓవర్‌ మూడో బంతికి మోమినల్ హక్ ఔటయ్యాడు. అయితే ఈ బంతి వేసే ముందు రోహిత్ వ్యూహాత్మకంగా షార్ట్ లెగ్, లెగ్ స్లిప్, స్లిప్, కవర్స్‌లో ఫీల్డర్‌ను పెట్టి మోమినల్ హక్‌ను దిగ్బందం చేశాడు.

రాహుల్ స్టన్నింగ్ క్యాచ్..
ఓవైపు అశ్విన్ బంతులు.. మరోవైపు రోహిత్ ఫీల్డ్ సెటప్‌తో ఉక్కిరి బిక్కిరి అయిన మోమినల్ హక్.. లెగ్‌సైడ్ ఊరిస్తూ వచ్చిన బంతిని స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఎడ్జ్ తీసుకున్న బంతి లెగ్ స్లిప్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌ వైపు దూసుకెళ్లగా.. అతను ఎలాంటి తప్పిదం లేకుండా అందుకున్నాడు.

దాంతో మోమినల్ హక్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీని టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ మెచ్చుకున్నాడు.

IND vs BAN Sunil Gavaskar hails Rohit Sharma captaincy for Mominul Haque dismissal in Kanpur Test

గవాస్కర్ ఫిదా..
ఈ మ్యాచ్‌కు ఇంగ్లీష్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న గవాస్కర్.. ఈ వికెట్ క్రెడిట్ రోహిత్ శర్మదేనని అభిప్రాయపడ్డాడు. 'రోహిత్ శర్మ నుంచి అద్భుతమైన కెప్టెన్సీ. మోమినల్ హక్ వికెట్ క్రెడిట్ పూర్తిగా అతనిదే. స్వీప్ షాట్ ఎక్కువగా ఆడే మోహినల్ హక్‌కు లెగ్ స్లిప్ ఫీల్డ్ పెట్టడం గొప్ప విషయం.'అని గవాస్కర్ ప్రశంసించాడు.

గెలుపు కోసం భారత్ పోరాటం..
వర్షం కారణంగా ఈ మ్యాచ్‌లో రెండున్నర రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయినా.. అటాకింగ్ గేమ్‌తో విజయం సాధించాలని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌‌లో 233 పరుగులకు ఆలౌటైంది. మోమినుల్ హక్ (194 బంతుల్లో, 17 ఫోర్లు, 1 సిక్సర్‌తో 107 నాటౌట్) అజేయ శతకంతో సత్తాచాటాడు.

అనంతరం భారత్.. తొలి ఇన్నింగ్స్‌ను 285/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. వ్యూహాత్మకంగా 34.4 ఓవర్లు మాత్రమే ఆడిన టీమిండియా.. బంగ్లాదేశ్‌పై 52 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్.. 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. డ్రా కోసం పోరాడుతోంది.

Story first published: Tuesday, October 1, 2024, 10:33 [IST]
Other articles published on Oct 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+