Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: నిప్పులు చెరిగిన SRH బౌలర్.. సంతోషంలో కావ్య పాప!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా శుభారంభం చేసింది. బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారత విజయంలో తమ ఆటగాడు కీలక పాత్ర పోషించడం మరింత సంతోషాన్నిచ్చిందని కామెంట్ చేస్తున్నారు. తమ ఓనర్ కావ్య మారన్ అయితే ఎగిరి గంతేయవచ్చని సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు.

రూ.10 కోట్ల భారీ ధరకు..
అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులను అంతలా సంతోషపెట్టిన ఆటగాడు ఎవరోకాదు.. టీమిండియా వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ. ఐపీఎల్ 2025 మెగా వేలంలో మహమ్మద్ షమీని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 10 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆ సమయంలో షమీని కొనుగోలు చేసి కావ్య మారన్ తప్పు చేసిందనే విమర్శలు వచ్చాయి. ఫిట్‌నెస్ సమస్యలతో పాటు 15 నెలలుగా ఆటకు దూరమైన ఆటగాడిపై గుడ్డిగా అన్ని డబ్బులు పెట్టడం దండుగ అనే అభిప్రాయం వ్యక్తమైంది.

IND vs BAN SRH Owner Kavya Maran Feels Happy After Mohammed Shami s 5-wicket haul in Champions Trophy 2025

కానీ తన ఫిట్‌నెస్‌, ఫామ్‌పై సందేహాలను పటాపంచలు చేస్తూ పునరాగమన హీరో మహమ్మద్ షమీ విజృంభించేశాడు. ఐసీసీ టోర్నీలంటేనే పునకాలు వచ్చే షమీ.. తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లతో బంగ్లాదేశ్‌ పతనాన్ని శాసించాడు. తద్వారా ఐసీసీ టోర్నీల్లో అత్యధిక వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. అంతేకాకుండా బంతుల పరంగా అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయి అందుకున్న పేసర్‌గా చరిత్రకెక్కాడు.

కావ్య మారన్ నమ్మకాన్ని..
వాస్తవానికి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌ల్లో షమీ తేలిపోయాడు. అతని సత్తాపై సందేహం లేకున్నా.. ఫిట్‌నెస్‌పై అనుమానం నెలకొంది. అదే సమయంలో వెన్ను గాయంతో జస్‌ప్రీత్ బుమ్రా జట్టుకు దూరం కావడంతో టీమిండియా బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపించింది. కానీ షమీ అద్భుత ప్రదర్శనతో అందరి సందేహాలను తీర్చాడు. బౌలర్‌గా తనలో ఇంకా సత్తా చాటి ఉందని చెప్పాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ నమ్మకాన్ని నిలబెట్టాడు.

ఇదే జోరును కొనసాగించి టీమిండియాకు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆ తర్వాత ఐపీఎల్ 2025 సీజన్‌లోనూ ఇదే తరహా బౌలింగ్‌తో సన్‌రైజర్స్‌కు విజయాలు అందించి కావ్య పాపను సంతోష పెట్టాలని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Story first published: Friday, February 21, 2025, 11:39 [IST]
Other articles published on Feb 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+