IND vs BAN: ఫీల్డింగ్ చేయకుండా నిద్రపోతున్నారా..? భారత ఆటగాళ్లపై కస్సుమన్న రోహిత్!(వీడియో)
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి సహనం కోల్పోయాడు. బంగ్లాదేశ్‌తో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మూడో రోజు ఆటలో రోహిత్ శర్మ.. సహచర భారత ఆటగాళ్లపై నోరు పారేసుకున్నాడు. ఫీల్డ్ సెట్ చేసే క్రమంలో తన సూచనలను పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫీల్డింగ్ చేస్తున్నారా? నిద్రపోతున్నారా? అని హిందీలో తిట్టాడు.
ఈ మాటలు స్టంప్‌మైక్‌లో రికార్డ్ అవ్వగా.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఏ ఆటగాడిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడనేదానిపై మాత్రం క్లారిటీ లేదు. ఆటగాళ్లతో చాలా చనువుగా ఉండే రోహిత్.. మైదానంలో తన సూచనలను పట్టించుకోకపోతే మాత్రం ఫైర్ అవుతాడు. ప్లేయర్స్‌ను రోహిత్ మందలించడం ఇదే తొలిసారి కాదు. గతంలో చాలా సందర్భాల్లోనూ సహచర ఆటగాళ్లపై నోరు పారేసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో భారత్ విజయం దిశగా సాగుతోంది. మరో ఆరు వికెట్లు సాధిస్తే గెలుపు లాంఛనమవుతుంది. రవిచంద్ర్ అశ్విన్ (3/63) ధాటికి.. మూడో రోజు ఆట ముగిసేసరికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లకు 158 పరుగులు చేసింది. విజయానికి బంగ్లాదేశ్ 357 పరుగుల దూరంలో ఉంది. వెలుతురులేమి కారణంగా శనివారం ఆటను అంపైర్లు ముందుగానే ముగించారు.
ప్రస్తుతం క్రీజులో నజ్ముల్ హోస్సెన్ షాంటో(54 బ్యాటింగ్)తో పాటు షకీబ్ అల్ హసన్(5 బ్యాటింగ్) ఉన్నారు. అంతకుముందు 81/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 287/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. శుభ్‌మన్ గిల్ ( 176 బంతుల్లో, 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 119 నాటౌట్), రిషభ్ పంత్ (128 బంతుల్లో, 13 ఫోర్లు, 4 సిక్సర్లతో 109) శతకాలతో చెలరేగారు.
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులకు ఆలౌటవ్వగా.. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. దాంతో రోహిత్ సేనకు 227 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. బ్యాటింగ్‌లో అశ్విన్(113), రవీంద్ర జడేజా(86) సత్తా చాటితే.. బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా(4/50) నిప్పులు చెరిగాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications