మరింత ఫిట్‌గా ఉండేందుకు బరువు తగ్గానని టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తెలిపాడు. ప్రస్తుతం తమిళనాడు వేదికగా జరుగుతున్న బుచ్చి బాబు టోర్నీలో ముంబై జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న సర్ఫరాజ్ ఖాన్.. అప్‌కమింగ్ టెస్ట్ సీజన్ కోసం రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సర్ఫరాజ్.. తొలి సిరీస్‌లోనే అద్భుత ప్రదర్శన కనబర్చాడు.
మినీ వేలంలో అన్‌సోల్డ్‌గా నిలవడంతో ఐపీఎల్ 2024 సీజన్ ఆడలేదు. అప్పటి నుంచి ప్రొఫెషనల్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అయితే ఈ సమయంలో తాను ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టానని సర్ఫరాజ్ ఖాన్ తెలిపాడు. సొంత గ్రామంలో తన తండ్రి పర్యవేక్షణలో ఫిట్‌నెస్‌తో పాటు తన ఆటను మెరుగుపరుచుకునేందుకు మరింత కష్టపడ్డానని చెప్పాడు.

ఎన్ని ట్రోఫీలు ఆడినా తనకు టీమిండియా తుది జట్టులో చోటు దక్కదని చెప్పాడు. అవకాశం వచ్చినప్పుడు సత్తా చాటేందుకు సిద్దంగా ఉన్నానని తెలిపాడు.'నాకు ఆఫ్ సీజన్ అనేది ఏం లేదు. నేను రోజు ఉదయం 4.15 నుంచి 4.30 మధ్య లేస్తాను. లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్‌తో నా రోజును మొదలుపెడుతాను. ఇది నా ఫిట్‌నెస్ మెరుగుదలకు మరింత ఉపయోగపడుతోంది.
రన్నింగ్ మొదలు పెట్టి నెల రోజులయ్యేసరికి 30-31 నిమిషాల్లోనే 5 కిలోమీటర్ల పరుగును సునాయసంగా పూర్తి చేస్తాను. రన్నింగ్ పూర్తయిన వెంటనే జిమ్‌కు వెళ్తాను. సగం రోజు వరకు ఫిట్‌నెస్, ఫీల్డింగ్ డ్రిల్స్ చేస్తాను. సాయంత్ర వేలల్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తాను. టీమిండియాకు ఆడాలనేది నా తండ్రితో పాటు నా కల. ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడి.. అది నేను నెరవేర్చాను.
ఇంతటితోనే పూర్తవ్వలేదు. ఇంకొన్నాళ్ల పాటు నేను టీమిండియాకు ఆడాలి. అందుకే నేను మరింత కష్టపడుతున్నాను. విశ్రాంతి తీసుకునే సమయం ఏ మాత్రం కాదు. ఏం జరిగినా.. నేను మరింత కష్టపడాల్సిందే. బంగ్లాదేశ్‌తో సిరీస్‌పై నేను ఫోకస్ పెట్టలేదు. నా విధానాన్ని మాత్రమే నమ్ముకున్నా. అవకాశం వచ్చినప్పుడు సత్తా చాటేందుకు సిద్దంగా ఉండాలనుకున్నాను.
అందుకు నాకు మ్యాచ్ ప్రాక్టీస్ కావాలి. వర్షాల కారణంగా ముంబైలో ఆడలేని పరిస్థితి. బౌలింగ్ మిషన్స్, సైడ్ ఆర్మ్ త్రోయర్స్‌తో ప్రాక్టీస్ చేయవచ్చు. కానీ ఇండోర్ ట్రైనింగ్ నాకు నచ్చదు. ఎందుకంటే బంతి బ్యాట్‌పైకి సునాయసంగా వస్తుంటుంది. పిచ్‌పై ఆడితేనే అసలు సిసలు సవాల్ ఎదురవుతోంది. ప్రాక్టీస్‌లో కష్టపడితేనే మన ఆట మెరుగవుతుంది.
బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో తుది జట్టులో చోటు దక్కుతుందని అనుకోవడం లేదు. కానీ అవకాశం వచ్చినప్పుడు సత్తా చాటేందుకు సిద్దంగా ఉన్నాను. ఇప్పటి వరకు నేను చేసిందదే. భవిష్యత్తులోనూ ఇదే పంథాను కొనసాగిస్తా.'అని సర్ఫరాజ్ ఖాన్ చెప్పుకొచ్చాడు.