For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs BAN: శుభ్‌మన్ గిల్ ప్రేమ బాణాలు ? స్టేడియంలో సారా టెండూల్కర్!

ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌కు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గారాల పట్టి సారా టెండూల్కర్ హాజరైంది. పుణె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌కు సారా టెండూల్కర్ తన స్నేహితులతో కలిసి వచ్చింది. స్టాండ్స్‌ నుంచి సారా టెండూల్కర్ ఈ మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ టీమిండియాకు మద్దతు తెలుపుతోంది.

దాంతో సోషల్ మీడియా వేదికగా మరోసారి శుభ్‌మన్ గిల్-సారా టెండూల్కర్ లవ్ గాసిప్స్ గుప్పుమన్నాయి. ఈ రూమర్లకు సారా టెండూల్కర్ ప్రవర్తన బలం చేకూర్చుంది. ఫీల్డింగ్ సమయంలో శుభ్‌మన్ గిల్ క్యాచ్ పట్టగా.. సారా టెండూల్కర్ ఎగిరి గంతేసింది.

IND vs BAN: Sara Tendulkar clapping after Shubman Gills two sixes, Pics Goes viral

బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్ రెండు సిక్స్‌లు బాదగా.. ఈ రెండు సందర్భాల్లోనూ సారా టెండూల్కర్ చప్పట్లతో అతన్ని అభినందించింది. దాంతో ఈ ఇద్దరి మధ్య మళ్లీ ప్రేమ మొదలైందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కోసమే సారా టెండూల్కర్ ఈ మ్యాచ్‌కు వచ్చిందని ఆరోపిస్తున్నారు. గతేడాది క్రితం వరకు సారా టెండూల్కర్, శుభ్‌మన్ గిల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శన కనబర్చినప్పుడల్లా సారా టెండూల్కర్ పేరు సోషల్ మీడియాలో మారుమోగేది. సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవ్వడం..తమ ఫొటోలకు కామెంట్ చేసుకోవడంతో ఈ ఇద్దరి ప్రేమయాణానికి సంబంధించిన వార్తలకు బలం చేకూరింది.

అయితే ఈ ఇద్దరి మధ్య బ్రేకప్ అయిందని, బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్‌తో శుభ్‌మన్ గిల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు కొత్త ప్రచారం తెరిపైకి వచ్చింది. ఈ ఇద్దరూ కలిసి ఓ కాఫీ షాప్‌లో కనిపించడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. దాంతో సారా టెండూల్కర్-శుభ్‌మన్ గిల్ లవ్‌కు సంబంధించిన గాసిప్స్‌కు బ్రేక్ పడింది.

తాజాగా సారా టెండూల్కర్.. టీమిండియా మ్యాచ్‌కు హాజరవ్వడంతో మరోసారి ఈ ఇద్దరి ప్రేమయాణం వార్తల్లో నిలిచింది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్(55 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

Story first published: Thursday, October 19, 2023, 20:11 [IST]
Other articles published on Oct 19, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+