IND vs BAN: 6 బంతుల్లో 5 సిక్స్‌లు.. ఉప్పల్‌లో సంజూ ఊచకోత!(వీడియో)
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజూ శాంసన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. బంగ్లాదేశ్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న మూడో టీ20లో సిక్సర్ల వర్షం కురిపించాడు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న ఉప్పల్ వికెట్‌పై బంగ్లాదేశ్ బౌలర్లను చెడుగుడు ఆడాడు. రిషద్ హోస్సేన్ వేసిన 10 ఓవర్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు బాది 30 పరుగులు పిండుకున్నాడు.
ఈ ఓవర్ తొలి బంతిని డాట్ చేసిన సంజూ శాంసన్.. ఫుల్‌టాస్‌గా వచ్చిన రెండో బంతిని సిక్సర్‌గా తరలించాడు. మూడో బంతిని లాంగాఫ్ దిశగా... నాలుగో బంతిని స్ట్రైట్‌గా.. ఐదో బంతిని లాంగాన్ దిశగా.. చివరి బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్స్‌బాది తాను ఎంత ప్రమాదకర ఆటగాడినో మరోసారి చాటి చెప్పాడు. తొలి రెండు టీ20ల్లో ఆశించిన రీతిలో రాణించకపోయినా.. టీమిండియా మేనేజ్‌మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.

ఓపెనర్ అభిషేక్ శర్మ విఫలమైనా.. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సంజూ శాంసన్.. అనంతరం మరింత ధాటిగా ఆడి 40 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో సంజూ శాంసన్‌కు ఇదే తొలి శతకం.
ప్రస్తుతం అతని సిక్సర్లకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సంజూ శాంసన్‌తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్లకు 297 పరుగుల భారీ స్కోర్ చేసింది.
చివర్లో రియాన్ పరాగ్( 13 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 34), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47) మెరుపులు మెరిపించారు. భారత బ్యాటర్ల ధాటికి బంగ్లాదేశ్ బౌలర్లు తేలిపోయారు. పోటా పోటీగా పరుగులిచ్చుకున్నారు. తంజిమ్ హసన్ షకీబ్ మూడు వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్, మహ్మదుల్లా, టస్కిన్ అహ్మద్ తలో వికెట్ తీసారు. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే రెండో అత్యధిక స్కోర్.
🚨 SANJU SAMSON SMASHED 5 CONSECUTIVE SIXES IN AN OVER. 🚨
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 12, 2024
- Ruthless Sanju at the Uppal. 🥶pic.twitter.com/lagJlSMMlM
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications