తన తప్పిదం వల్లే అక్షర్ పటేల్ హ్యాట్రిక్ వికెట్ మిస్సైందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంగీకరించాడు. అది సునాయస క్యాచ్ అని, తాను పట్టాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌కు హ్యాట్రిక్ ఛాన్స్ లభించింది. కానీ హ్యాట్రిక్ బాల్‌కు బంగ్లాదేశ్ బ్యాటర్ జకేర్ అలీ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను స్లిప్‌లో రోహిత్ శర్మ నేలపాలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు హిట్‌మ్యాన్‌పై విమర్శలు గుప్పించారు.
అక్షర్‌కు దావత్ ఇస్తా..
మ్యాచ్ అనంతరం హోస్ట్ ఈ విషయంపై ప్రశ్నించగా రోహిత్ శర్మ తనదైన శైలిలో బదులిచ్చి నవ్వులు పూయించాడు. అక్షర్ పటేల్‌ను డిన్నర్‌కు తీసుకెళ్తానని చెప్పాడు. 'రేపు అక్షర్ పటేల్‌ను డిన్నర్‌కు తీసుకెళ్తా(నవ్వుతూ). అది చాలా ఈజీ క్యాచ్. ఆ క్యాచ్‌ను నేను పట్టాల్సింది. ఈ స్థాయి క్రికెట్‌లో ఇలాంటి తప్పిదాలు చేయకూడదు. కానీ ఆటలో అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటాయి. క్రెడిట్ హృదయ్, జకేర్ అలీది. ఇద్దరూ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

గిల్, రాహుల్ బ్యాటింగ్ సూపర్..
అంతకుముందు భారత విజయంపై స్పందిస్తూ.. శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్‌లపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ ఇద్దరూ అద్భుతంగా ఆడారని కొనియాడాడు. 'మైదానంలోకి అడుగు పెట్టకముందే ఆత్మవిశ్వాసంతో ఉండాలి. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ విభిన్నమైన భావోద్వేగాలు కలుగుతాయి. అయితే మా డ్రెస్సింగ్ రూమ్‌లో చాలా అనుభవం ఉంది. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ అద్భుతంగా ఆడారు. ఒక్క మ్యాచ్‌కే పిచ్ నెమ్మదిగా మారిందని చెప్పడం కష్టం. పరిస్థితులకు తగ్గట్లు ఆడాల్సిందే. ఈ మ్యాచ్‌లో జట్టుగా మేం పరిస్థితులను అందిపుచ్చుకున్నాం.
నేను క్యూరెటర్ కాదు..
మహమ్మద్ షమీ ప్రదర్శన చాలా సంతోషాన్నిచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత అతను అదరగొట్టాడు. షమీ జట్టు కోసం ఏం చేస్తాడో మాకు తెలుసు. అతనిలా అవసరమైనప్పుడు ఆడే ఆటగాళ్లు మాకు కావాలి. శుభ్‌మన్ గిల్ క్లాస్ బ్యాటింగ్ గురించి మాకు తెలుసు. మా ఆటగాళ్ల ప్రదర్శన పట్ల ఎలాంటి ఆశ్చర్యం కలగలేదు. గిల్ చివరి వరకు ఆడటం చూడ ముచ్చటగా ఉంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కూడా పిచ్ ఇలానే ఉంటుందా? అంటే కచ్చితంగా చెప్పలేను. కానీ నా అంచనా ప్రకారం దాదాపు అలానే ఉండొచ్చు. కచ్చితంగా పిచ్ ఎలా ఉంటుందో చెప్పడానికి నేనేం క్యూరెటర్ కాదు. 'అని రోహిత్ శర్మ తెలిపాడు.
అటు షమీ.. ఇటు గిల్..
ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు కుప్పకూలింది. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ(5/53) ఐదు వికెట్లతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించగా.. హర్షిత్ రానా(3/31) మూడు, అక్షర్ పటేల్(2/43) రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం భారత్ 46.3 ఓవర్లలో 4 వికెట్లకు 231 పరుగులు చేసి గెలుపొందింది. శుభ్‌మన్ గిల్(129 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 101 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. రోహిత్ శర్మ(36 బంతుల్లో 7 ఫోర్లతో 41), కేఎల్ రాహుల్(47 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 41 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
Tanzid ☝️
— Star Sports (@StarSportsIndia) February 20, 2025
Mushfiqur☝️
Hattrick... Well, almost! 😮
📺📱 Start watching FREE on JioHotstar: https://t.co/dWSIZFgk0E#ChampionsTrophyOnJioStar 👉 #INDvBAN, LIVE NOW on Star Sports 1 & Star Sports 1 Hindi! pic.twitter.com/5mn6Eqivci