IND vs BAN: అందుకే అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తీ ఆడటం లేదు: రోహిత్ శర్మ
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడి ఫీల్డింగ్‌కు దిగింది. టాస్ గెలిచినా తాము ఫీల్డింగ్ ఎంచుకునేవాళ్లమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. కొన్నెళ్ల క్రితం ఇక్కడ ఆడినప్పుడు అండర్ ది లైట్స్ బ్యాటింగ్ ఈజీగా అనిపించిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశాడు.
'టాస్ గెలిచినా నేను ఫీల్డింగ్ ఎంచుకునేవాడిని. కొన్నెళ్ల క్రితం ఇక్కడ ఆడాం. అండర్ లైట్స్ బ్యాటింగ్ ఈజీగా ఉంటుంది. జట్టు బాగుంది. ప్రతీ ఒక్కరు ఫిట్‌గా ఉన్నారు. మేం శుభారంభం చేస్తామని ఆశిస్తున్నా. ఈ టోర్నీలో ప్రతీ మ్యాచ్ గెలవడం కీలకమే. వరుణ్ చక్రవర్తీ, అర్ష్‌దీప్ సింగ్ ఈ మ్యాచ్ ఆడటం లేదు. ఇంగ్లండ్‌తో చివరి వన్డేకు దూరంగా ఉన్న మహహ్మద్ షమీ, రవీంద్ర జడేజాలు తుది జట్టులోకి వచ్చారు. దాంతో అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తీ ఉద్వాసనకు గురయ్యారు. టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తీ ఆడటం లేదు'అని రోహిత్ శర్మ తెలిపాడు.

మరోవైపు టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హోస్సెన్ షాంటో బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. భారీ లక్ష్యాన్ని నమోదు చేయాలనుకుంటున్నాం. మంచి క్రికెట్ ఆడాలనుకుంటున్నాం. కుర్రాళ్లంతా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం.'అని నజ్ముల్ హోస్పెన్ షాంటో తెలిపాడు.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్
బంగ్లాదేశ్: టాంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), టౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, రిషద్ హుస్సేన్, టంజిమ్ హసన్ సకీబ్, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications