IND vs BAN: జకేర్ భాయ్.. చెల్లుకు చెల్లు! రాహుల్ క్యాచ్ డ్రాప్‌పై రోహిత్ రియాక్షన్ వైరల్!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌కు సంబంధించిన ఈ వీడియో నెటిజన్లు ఆకట్టుకుంటుంది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సునాయస క్యాచ్‌ను బంగ్లాదేశ్ ప్లేయర్ జకేర్ అలీ నేలపాలు చేయగా.. రోహిత్ శర్మ తనదైన శైలిలో స్పందించాడు. అతని రియాక్షన్ టీవీ కెమెరాల్లో కనిపించింది.
'నేను నీ క్యాచ్ వదిలేసా.. నువ్వు మా బ్యాటర్ క్యాచ్ వదిలేసావ్.. చెల్లుకు చెల్లు'అని రోహిత్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ఈ రియాక్షన్‌ను చూసి కామెంటేటర్లు నవ్వుకున్నారు. అతని రియాక్షన్‌ను వివరించారు.
మలుపుతప్పిన క్యాచ్ డ్రాప్
భారత ఇన్నింగ్స్ సందర్భంగా టస్కిన్ అహ్మద్ వేసిన 37వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని టస్కిన్ అహ్మద్ ఓవర్ పిచ్డ్‌గా వేయగా.. రాహుల్ స్క్వేర్ లెగ్ సైడ్ వైపు భారీ షాట్ ఆడాడు. బంతి సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో గాల్లోకి తేచింది.
అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జకేర్ అలీకి చేతిలోకి రాగా.. అతను బంతిని ఒడిసి పట్టుకులేకపోయాడు. దాంతో కేఎల్ రాహుల్‌తో పాటు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ ఊపిరి పీల్చుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ అయితే తెగ సంతోషానికి గురయ్యాడు. బంగ్లాదేశ్ బ్యాటింగ్ సందర్భంగా జకేర్ అలీ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను రోహిత్ శర్మ నేలపాలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్యాచ్ డ్రాప్ కారణంగా అక్షర్ పటేల్ హ్యాట్రిక్ వికెట్ మిస్సైంది.

ఈ క్యాచ్ పట్టి ఉంటే జకెర్ అలీ గోల్డెన్ డక్ అయ్యేవాడు. 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జాకెర్ అలీకి మరో లైఫ్ లభించింది. స్టంప్ ఔట్ చేసే అవకాశాన్ని కేఎల్ రాహుల్ వృథా చేశాడు. ఈ అవకాశాలను అందిపుచ్చుకున్న అతను ఏకంగా 68 పరుగులు చేశాడు. టౌహిడ్ హృదయ్‌తో కలిసి 6వ వికెట్‌కు ఏకంగా 154 పరుగులు జోడించాడు.
Rohit sharma be like : - mein catch chora hai...abh tum bhi catch choro😅😂#RohitSharma #ChampionsTrophy2025 #RohitSharma𓃵 #ChampionsTrophy pic.twitter.com/PschBwPBqY
— Ravi Sharma (@RaviSharma2845) February 20, 2025
భారత్ ఘన విజయం..
ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు కుప్పకూలింది. టౌహిడ్ హృదయ్(118 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 100) సెంచరీతో రాణించగా.. జకేర్ అలీ(114 బంతుల్లో 4 ఫోర్లతో 68) హాఫ్ సెంచరీతో అతనికి అండగా నిలిచాడు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ(5/53) ఐదు వికెట్లతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించగా.. హర్షిత్ రానా(3/31) మూడు, అక్షర్ పటేల్(2/43) రెండు వికెట్లు పడగొట్టారు.
శుభ్‌మన్ గిల్ శతకం..
అనంతరం భారత్ 46.3 ఓవర్లలో 4 వికెట్లకు 231 పరుగులు చేసి గెలుపొందింది. శుభ్‌మన్ గిల్(129 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 101 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. రోహిత్ శర్మ(36 బంతుల్లో 7 ఫోర్లతో 41), కేఎల్ రాహుల్(47 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 41 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హుస్సేన్ రెండు వికెట్లు తీయగా.. టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ తలో వికెట్ పడగొట్టారు.
Rohit Sharma 👑🫶.! pic.twitter.com/lwMZT8aWR5
— Ram Charan Trends ❤️🔥 (@AlwaysRavi045) February 20, 2025
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications