Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: రోహిత్ ముంగిట కోహ్లీకి సాధ్యం కానీ వరల్డ్ రికార్డ్..!

ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు కెప్టెన్ రోహిత్ శర్మను పలు రికార్డ్‌లు ఊరిస్తున్నాయి. రికార్డుల రారాజు, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సాధ్యం కానీ ఘనతలను అందుకునేందుకు రోహిత్ శర్మ అడుగు దూరంలో నిలిచాడు. గురువారం( సెప్టెంబర్ 19) నుంచి చెన్నై వేదికగా జరిగే తొలి టెస్ట్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది.

తొలి బ్యాటర్‌గా..
ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ ఒక సెంచరీ నమోదు చేస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) చరిత్రలోనే 10 శతకాలు నమోదు చేసిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కనున్నాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోరూట్ 16 శతకాలతో అగ్రస్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా ప్లేయర్ మార్నస్ లబుషేన్ 11 శతకాలతో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ 10 సెంచరీలతో మూడో స్థానంలో నిలిచాడు.

IND vs BAN Rohit Sharma Needs One Century And 8 Sixes Against Bangladesh To Create History

50 శతకాలకు..
అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో 50 శతకాల మైలురాయి అందుకునేందుకు రోహిత్ రెండు సెంచరీల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం అతను మూడు ఫార్మాట్లలో కలిపి 48 సెంచరీలు నమోదు చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 100 శతకాలతో అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ 80 సెంచరీలతో రెండో స్థానంలో నిలిచాడు.

సెహ్వాగ్ ఆల్‌టైమ్ రికార్డ్..
చెన్నై వేదికగా జరిగే తొలి టెస్ట్‌లో రోహిత్ శర్మ మరో 8 సిక్స్‌లు బాదితే.. భారత్ తరఫున టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా చరిత్రకెక్కుతాడు. ఈ క్రమంలో అతను టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను అధిగమిస్తాడు. వీరేంద్ర సెహ్వాగ్ 103 టెస్ట్‌లు, 178 ఇన్నింగ్స్‌ల్లో 91 సిక్స్‌లు బాదగా.. రోహిత్ శర్మ 59 మ్యాచ్‌లు, 101 ఇన్నింగ్స్‌ల్లో 84 సిక్స్‌లు కొట్టాడు.

రోహిత్ మరో 7 సిక్స్‌లు బాదితే సెహ్వాగ్‌ను అధిగమిస్తాడు. ఈ జాబితాలో 78 సిక్స్‌లతో ధోనీ, 69 సిక్స్‌లతో సచిన్, 64 సిక్స్‌లతో రవీంద్ర జడేజా తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. 90 టెస్ట్‌లు 144 ఇన్నింగ్స్‌లో ధోనీ 78 సిక్స్‌లు బాదగా.. సచిన్ టెండూల్కర్ 329 ఇన్నింగ్స్‌ల్లో 69 సిక్స్‌లు కొట్టాడు. జడేజా 105 ఇన్నింగ్స్‌ల్లో 64 సిక్స్‌లు బాదాడు.

మరో 16 సిక్స్‌లు బాదితే టెస్ట్‌ల్లో 100 సిక్స్‌లు బాదిన తొలి ప్లేయర్‌గా రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర లిఖిస్తాడు. ప్రస్తుతం కెరీర్ చివరి దశలో ఉన్న రోహిత్ శర్మ.. ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాడు. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ తర్వాత రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే ఛాన్స్ ఉంది.

Story first published: Tuesday, September 17, 2024, 19:13 [IST]
Other articles published on Sep 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+