IND vs BAN: బంగ్లాదేశ్ అంటే రోహిత్ శర్మకు పూనకమే.. బౌలర్లకు దబిడి దిబిడే!

ఢాకా: బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న టీమిండియా తొలి సమరానికి సిద్దమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఢాకా వేదికగా జరగనున్న తొలి వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. టీ20 ప్రపంచకప్ వైఫ్యలం అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆడుతున్న తొలి సిరీస్ ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం ఈ పర్యటనతోనే రీఎంట్రీ ఇచ్చాడు. వచ్చే ఏడాది భారత్ వేదికగా జరగనున్న ప్రపంచకప్ కోసం భారత జట్టు ఈ సిరీస్ నుంచే సన్నాహకాలను మొదలుపెట్టనుంది.
అయితే బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు రోహిత్ శర్మ రికార్డులు అతని ఫ్యాన్స్‌లో అంచనాలను రేకెత్తిస్తున్నాయి. బంగ్లాదేశ్ అంటే రెచ్చిపోయే రోహిత్.. ఈ సిరీస్‌లో కూడా దుమ్మురేపుతాడని అతని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బంగ్లాదేశ్‌పై చివరి 8 ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 97.83 యావరేజ్‌తో 587 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక వన్డేల్లో రోహిత్ 93.35 స్ట్రైక్‌రేట్‌తో 60 యావరేజ్‌తో పరుగులు చేశాడు. దాంతో రోహిత్ శర్మ ఆదివారం జరిగే తొలి వన్డేలో సెంచరీ చేస్తాడని అతని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
టీ20 ప్రపంచకప్‌లో దారుణంగా విఫలమైన రోహిత్.. భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. లేకుంటే విమర్శలు రెట్టింపు అవుతాయి. ఫామ్‌లో రావడానికే రోహిత్‌కు ఇదే చక్కని అవకాశమని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీకి సైతం బంగ్లాపై మంచి రికార్డు ఉంది. ఇరు దేశాల మధ్య ఇప్పటి వరకు 21 వన్డేలు జరగ్గా భారత్ 17 మ్యాచ్‌ల్లో గెలిచి పై చేయి సాధించింది. బంగ్లాదేశ్ మాత్రం 4 మ్యాచ్‌ల్లోనే గెలిచింది. అయితే సొంతగడ్డపై బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుంది.
ఈ సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. ప్రస్తుతం భారత్‌లో ఉన్న ఉమ్రాన్ మాలిక్ ఆదివారం జట్టుతో కలిసే అవకాశం ఉంది. ఈ లెక్కన అతను తొలి వన్డే ఆడే అవకాశం లేదు. దాంతో కుల్దీప్ సేన్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications