Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: రోహిత్ శర్మ‌ను ఊరిస్తున్న వీరేంద్ర సెహ్వాగ్ ఆల్‌టైమ్ రికార్డ్!

ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు కెప్టెన్ రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డ్ ఊరిస్తోంది. 45 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా మైదానంలో అడుగు పెడుతోంది. బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ కోసం 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

ఇప్పటికే చెన్నై చేరుకున్న భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ కూడా ప్రారంభించారు. నెట్స్‌లో గంటలకొద్దీ ప్రాక్టీస్ చేస్తున్నారు. చెన్నై వేదికగా జరిగే తొలి టెస్ట్‌లో రోహిత్ శర్మ మరో 7 సిక్స్‌లు బాదితే.. భారత్ తరఫున టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా చరిత్రకెక్కుతాడు. ఈ క్రమంలో అతను టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను అధిగమిస్తాడు.

IND vs BAN Rohit Sharma Eyes Virender Sehwag s ALL-TIME Test record

వీరేంద్ర సెహ్వాగ్ 103 టెస్ట్‌లు, 178 ఇన్నింగ్స్‌ల్లో 90 సిక్స్‌లు బాదగా.. రోహిత్ శర్మ 59 మ్యాచ్‌లు, 101 ఇన్నింగ్స్‌ల్లో 84 సిక్స్‌లు కొట్టాడు. రోహిత్ మరో 7 సిక్స్‌లు బాదితే సెహ్వాగ్‌ను అధిగమిస్తాడు. ఈ జాబితాలో 78 సిక్స్‌లతో ధోనీ, 69 సిక్స్‌లతో సచిన్, 64 సిక్స్‌లతో రవీంద్ర జడేజా తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. 90 టెస్ట్‌లు 144 ఇన్నింగ్స్‌లో ధోనీ 78 సిక్స్‌లు బాదగా.. సచిన్ టెండూల్కర్ 329 ఇన్నింగ్స్‌ల్లో 69 సిక్స్‌లు కొట్టాడు. జడేజా 105 ఇన్నింగ్స్‌ల్లో 64 సిక్స్‌లు బాదాడు.

మెక్‌కల్లమ్ రికార్డ్‌పై కన్నేసిన యశస్వి జైస్వాల్..
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను మరో రికార్డు ఊరిస్తోంది. టెస్ట్‌ల్లో ఒకే క్యాలండర్ ఇయర్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా నిలిచేందుకు యశస్వి జైస్వాల్ 8 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. ఈ రికార్డ్ న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ పేరిట ఉంది. 2014లో అతను 33 సిక్స్‌లు బాదాడు.

అయితే ఈ ఏడాది యశస్వి జైస్వాల్ 26 సిక్స్‌లు కొట్టాడు. ప్రస్తుతం అతను ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో సమంగా నిలిచాడు. అతను 2022లో 26 సిక్స్‌లు బాదాడు. ఈ ఏడాది యశస్వి జైస్వాల్ 74 సగటుతో 740 రన్స్ చేశాడు. ఇందులో అత్యధిక స్కోర్ 214 నాటౌట్ కాగా.. 74 ఫోర్లు ఉన్నాయి.

2014లో బ్రెండన్ మెక్‌కల్లమ్ 9 మ్యాచ్‌లు 16 ఇన్నింగ్స్‌ల్లో 33 సిక్స్‌లతో పాటు 131 బౌండరీలు బాదాడు. ఆ తర్వాత బెన్ స్టోక్స్ 2022లో 15 మ్యాచ్‌లు 26 ఇన్నింగ్స్‌ల్లో 26 సిక్స్‌లతో పాటు 94 బౌండరీలు కొట్టాడు. ఈ ఏడాది యశస్వి జైస్వాల్ 6 మ్యాచ్‌లు 11 ఇన్నింగ్స్‌ల్లోనే 26 సిక్స్‌లు బాదాడు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో అతను మరో 8 సిక్స్‌లు బాదితే మెక్‌కల్లమ్‌ను అధిగమించనున్నాడు.

Story first published: Saturday, September 14, 2024, 14:46 [IST]
Other articles published on Sep 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+