IND vs BAN: ఈజీ క్యాచ్ వదిలేసిన రోహిత్.. అక్షర్ పటేల్ హ్యాట్రిక్ మిస్! (వీడియో)
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఘోర తప్పిదం చేశాడు. సునాయస క్యాచ్‌ను నేలపాలు చేశాడు. దాంతో అక్షర్ పటేల్ హ్యాట్రిక్ వికెట్ మిస్సైంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా బంగ్లాదేశ్ జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్షర్ పటేల్ వేసిన 9వ ఓవర్‌లో రెండో, మూడో బంతికి టంజిద్ హసన్(25), ముష్ఫికర్ రహీమ్(0) కీపర్ క్యాచ్‌లుగా వెనుదిరిగారు.
ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన జాకెర్ అలీ ఈ ఓవర్ నాలుగో బంతికి క్యాచ్ ఇవ్వగా ఫస్ట్ స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ నేలపాలు చేశాడు. బంతిని అందుకున్నట్లే అందుకొని విడిచిపెట్టాడు. దాంతో తీవ్ర అసహనానికి గురైన అతను నేలను గట్టిగా కొట్టాడు.

ఆ వెంటనే అక్షర్ పటేల్‌ను క్షమాపణలు కోరాడు. ఈ క్యాచ్ పట్టి ఉంటే అక్షర్ పటేల్ ఖాతాలో హ్యాట్రిక్ వికెట్ చేరేది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. క్యాచ్‌ను విడిచిపెట్టిన రోహిత్ శర్మపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'ఎంత పనిచేశావ్ రోహిత్..?', అక్షర్ పటేల్ కొంపముంచావ్? అని కామెంట్ చేస్తున్నారు.
Tanzid ☝️
— Star Sports (@StarSportsIndia) February 20, 2025
Mushfiqur☝️
Hattrick... Well, almost! 😮
📺📱 Start watching FREE on JioHotstar: https://t.co/dWSIZFgk0E#ChampionsTrophyOnJioStar 👉 #INDvBAN, LIVE NOW on Star Sports 1 & Star Sports 1 Hindi! pic.twitter.com/5mn6Eqivci
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్ భారత బౌలర్ల ధాటికి 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. మహమ్మద్ షమీ, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా ఓ వికెట్ పడగొట్టాడు. భారత బౌలర్ల ధాటికి సౌమ్య సర్కార్(0), నజ్ముల్ హోస్సేన్ షాంటో(0), ముష్ఫికర్ రహీమ్(0) డకౌట్ అవ్వగా.. మెహ్‌దీ హసన్ మీరాజ్(5)తీవ్రంగా నిరాశపరిచాడు. టంజిద్ హసన్ కాసేపు ఆడినా.. అతన్ని అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చాడు. క్రీజులో టౌహిద్ హృదయ్(15 నాటౌట్), జాకెర్ అలీ(16 నాటౌట్) ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications