For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs BAN: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ ఆల్‌టైమ్ రికార్డ్ బద్దలు!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 11వేల పరుగుల మైలురాయి అందుకున్న రెండో బ్యాటర్‌గా హిట్ మ్యాన్ నిలిచాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 36 బంతుల్లో 7 ఫోర్లతో 41 పరుగులు చేసిన రోహిత్ తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. అయితే 13 పరుగుల వ్యవక్తిగత స్కోర్ వద్ద 11 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు.

1
63678

సచిన్ రికార్డ్ బద్దలు..
261 వన్డే ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ను రోహిత్ అధిగమించాడు. మాస్టర్ బ్లాస్టర్ 276 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ టాప్‌లో ఉన్నాడు. అతను 222 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు. రికీ పాంటింగ్(286), సౌరవ్ గంగూలీ(288), జాక్వస్ కల్లీస్(293) టాప్-6లో కొనసాగుతున్నారు.

IND vs BAN Rohit Sharma Creates History As Becomes Second Fastest To 11k ODI Runs

శ్రీలంక యూనిక్ రికార్డ్ బ్రేక్
వన్డేల్లో భారత్ తరఫున 11 వేల పరుగుల క్లబ్‌లో చేరిన ఐదో బ్యాటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. తద్వారా శ్రీలంక పేరిట ఉన్న అరుదైన రికార్డ్‌ను టీమిండియా అధిగమించింది. వన్డేల్లో 11వేల పరుగులు చేసిన అత్యధిక బ్యాటర్లు కలిగిన దేశంగా భారత్‌ నిలిచింది. ఈ రికార్డ్ శ్రీలంక పేరిట ఉండగా.. భారత్ అధిగమించింది. శ్రీలంక తరఫున కుమార సంగక్కర, మహేళ జయవర్దనే, సనత్ జయసూర్య ఈ ఫీట్ సాధించారు. భారత్ తరఫున సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీతో పాటు రోహిత్ శర్మ 11 వేల క్లబ్‌లో చేరడంతో భారత్‌కు ఈ ఘనత దక్కింది.

రోహిత్ ఒకే ఒక్కడు..
భారత్ తరఫున అత్యధిక ఐసీసీ టోర్నీలు ఆడిన ఆటగాడిగానూ రోహిత్ శర్మ నిలిచాడు. హిట్ మ్యాన్‌కు ఇది 15వ ఐసీసీ టోర్నీ. ఈ క్రమంలో అతను యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలను అధిగమించాడు. రోహిత్ శర్మకు ఇది మూడో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. ఇప్పటి వరకు హిట్ మ్యాన్ మూడు(2015, 2019, 2023) వన్డే ప్రపంచకప్‌లు ఆడాడు. 9 టీ20 ప్రపంచకప్‌లు ఆడాడు.

Story first published: Thursday, February 20, 2025, 20:06 [IST]
Other articles published on Feb 20, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+