For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs BAN: రిషభ్ పంత్ X లిట్టన్ దాస్ డిష్యూం డిష్యూం! (వీడియో)

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్, బంగ్లాదేశ్ కీపర్ లిట్టన్ దాస్ గొడవ పడ్డారు. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నై వేదికగా గురువారం ప్రారంభమైన తొలి మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ఆదిలోనే 3 వికెట్లు కోల్పోయింది. దాంతో వికెట్ కీపర్ రిషభ్ పంత్ త్వరగా బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది.

ఘోర రోడ్డు ప్రమాదంతో రిషభ్ పంత్.. సుదీర్ఘ విరామం తర్వాత రెడ్ బాల్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. రెండేళ్ల క్రితం(2022) బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచే పంత్‌కు చివరిది కావడం విశేషం. అయితే క్రీజులోకి వచ్చిన వెంటనే రిషభ్ పంత్.. లిట్టన్ దాస్‌తో వాగ్వాదానికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. టాస్కిన్ అహ్మద్ వేసిన 16వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

IND vs BAN Rishabh Pant-Litton Das HEATED Argument During Chennai Test Video Goes VIRAL

సింగిల్ ఎలా తీస్తావంటూ..?
ఈ ఓవర్ మూడో బంతిని యశస్వి జైస్వాల్ పాయింట్ దిశగా ఆడగా.. రిషభ్ పంత్ క్విక్ సింగిల్‌కు ప్రయత్నించాడు. కానీ బంతి ఫీల్డర్ అందుకున్న విషయాన్ని గ్రహించి యూటర్న్ తీసుకున్నాడు. అయితే ఫీల్డర్ నేరుగా రిషభ్ పంత్ కాళ్లకు బంతిని విసిరేయగా.. అతని ప్యాడ్లను తాకి దూరంగా వెళ్లింది. దాంతో రిషభ్ పంత్ ఓవర్ త్రో రూపంలో సింగిల్ తీసుకున్నాడు.

అయితే ఇలా సింగిల్ తీయడం సరికాదని లిట్టన్ దాస్ రిషభ్ పంత్‌తో గొడవకు దిగాడు. బంతి ప్యాడ్స్‌ను తాకిన తర్వాత సింగిల్ తీయడం క్రీడా స్ఫూర్తికి విరుద్దమని వాదించాడు. సాధారణంగా బంతి ప్యాడ్స్ తాకిన తర్వాత బ్యాటర్లు సింగిల్ తీయరు. రూల్స్‌లో లేకున్నా.. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తారు.

కాళ్లను ఎందుకు టార్గెట్ చేశారు..?
అయితే బంతిని స్టంప్స్ వైపు కాకుండా తన కాళ్లకు కొట్టడాన్ని పంత్ తప్పుబట్టాడు. కాళ్లకు కొట్టడం క్రీడా స్ఫూర్తినా..? అని లిట్టన్ దాస్‌ను నిలదీసాడు. దానికి లిట్టన్ దాస్ మౌనంగా ఉండిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో రిషభ్ పంత్(39) విఫలమైనా.. యశస్వి జైస్వాల్‌తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని అందించాడు. నాలుగో వికెట్‌కు 62 పరుగులు జోడించాడు.

హాఫ్ సెంచరీకి చేరువైన అతను అనవసరపు షాట్‌తో పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో హసన్ మహమూద్ ధాటికి రోహిత్ శర్మ(6), శుభ్‌మన్ గిల్(0), విరాట్ కోహ్లీ(6) దారుణంగా విఫలమయ్యారు. దాంతో 34 పరుగులకే భారత్ 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్(43 బ్యాటింగ్), పంత్‌తో కలిసి జట్టును ఆదుకున్నాడు. 88/3తో తొలి సెషన్‌ను ముగించాడు.

లంచ్ బ్రేక్ అనంతరం రెండో సెషన్ ఆరంభంలోనే పంత్ స్లిప్ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజులోకి కేఎల్ రాహుల్ రాగా.. యశస్వి జైస్వాల్ ఆచితూచి ఆడుతున్నాడు. ప్రస్తుతం 34 ఓవర్లు ముగిసే సరికి భారత్ 126 పరుగులు చేసింది.

Story first published: Thursday, September 19, 2024, 13:30 [IST]
Other articles published on Sep 19, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+