Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: కీపర్ తలపై నుంచి రింకూ సింగ్ వినూత్న షాట్.. గాడ్స్ ప్లాన్ అంటూ సంబరాలు!(వీడియో)

టీమిండియా టీ20 సెన్సేషన్ రింకూ సింగ్ మరోసారి విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. బంగ్లాదేశ్‌తో రెండో టీ20లో రింకూ సింగ్ 26 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. మరోసారి జట్టు కష్టాల్లో ఉన్న సమయంలోనే తనదైన హిట్టింగ్‌తో ఆదుకున్నాడు. వినూత్న షాట్‌తో రింకూ సింగ్ హాఫ్ సెంచరీ మార్క్ అందుకోవడం గమనార్హం.

తంజీమ్ షకీబ్ వేసిన 16వ ఓవర్ చివరి బంతిని రింకూ సింగ్ స్క్వేర్ లెగ్ దిశగా ఫ్లిక్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్ కీపర్ మీదుగా సిక్స్‌గా వెళ్లింది. అప్పటికే రెండు ఫోర్లు బాదిన రింకూ సింగ్.. హ్యాట్రిక్ బౌండరీలతో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ వెంటనే తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు.

IND vs BAN Rinku Singh shows off his God s Plan tattoo after scoring fifty in 2nd T20I Video

'ఇదంతా ఆ దేవుడి ప్రణాళిక'అంటూ తన చేతిపై ఉన్న గాడ్స్ ప్లాన్ అనే టాటూను భారత డగౌట్‌ వైపు చూపించాడు. అనంతరం ఆకాశం వైపు చూస్తూ దేవుడిని మొక్కాడు. మరోవైపు టీమిండియా డగౌట్ మొత్తం రింకూ సింగ్ హాఫ్ సెంచరీకి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది. ప్రస్తుతం రింకూ సింగ్‌కు సంబంధించిన ఈ సెలెబ్రేషన్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

రింకూ సింగ్(29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53)‌తో పాటు నితీష్ కుమార్ రెడ్డి(34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 74) కూడా విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. 41 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత జట్టును నితీష్-రింకూ 108 పరుగుల భారీ భాగస్వామ్యంతో ఆదుకున్నారు.

హార్దిక్ పాండ్యా(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) కూడా దూకుడుగా ఆడాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ షకీబ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ రెండేసి వికెట్లు తీయగా.. రిషద్ హోస్సేన్ మూడు వికెట్లు పడగొట్టాడు.

Story first published: Wednesday, October 9, 2024, 21:27 [IST]
Other articles published on Oct 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+