Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా.. !

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో విజయాలు సాధించిన మ్యాచ్‌ల్లో 2000 ప్లస్ పరుగులతో పాటు 200 ప్లస్ వికెట్లు తీసిన తొలి ప్లేయర్‌గా జడేజా చరిత్రకెక్కాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జడేజా ఈ ఫీట్ సాధించాడు. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో జడేజా హాఫ్ సెంచరీతో పాటు రెడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 5 వికెట్లు పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. దాంతో జడేజా 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఎవరీకి సాధ్యం కానీ రికార్డ్‌ను అందుకున్నాడు. భారత్ గెలిచిన టెస్ట్‌ల్లో జడేజా ఇప్పటి వరకు 2003 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 218 వికెట్లు పడగొట్టాడు. తద్వారా టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే విజయాలు సాధించిన మ్యాచ్‌ల్లో 200 ప్లస్ వికెట్లతో పాటు 2000 ప్లస్ రన్స్ చేసిన తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు.

IND vs BAN Ravindra Jadeja Creates History Becomes First Player In The World To Achieve Massive Feat

రవీంద్ర జడేజా తర్వాత టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ జాబితాలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతను భారత్ సాధించి టెస్ట్ విజయాల్లో 1943 పరుగులతో పాటు 369 వికెట్లు తీసాడు. బంగ్లాదేశ్‌తో కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో అశ్విన్ 57 పరుగులు చేసి భారత్ విజయం సాధిస్తే.. 2000 పరుగులతో పాటు 300 వికెట్లు తీసిన తొలి ప్లేయర్‌గా నిలుస్తాడు.

జడేజా@300
ప్రస్తుతం జడేజా టెస్ట్‌ల్లో 299 వికెట్లు తీసాడు. 300 వికెట్ల మైలురాయి అందుకునేందుకు ఒక్క వికెట్ దూరంలో ఉన్నాడు. కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో జడేజా ఈ ఫీట్ సాధించనున్నాడు. తద్వారా భారత్ తరఫున 300 వికెట్లు తీసిన తొలి లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా చరిత్రకెక్కనున్నాడు.

తొలి టెస్ట్‌లో జడేజా అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన జడేజా(86) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన జడేజా.. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు.

Story first published: Friday, September 27, 2024, 14:42 [IST]
Other articles published on Sep 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+