Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN:చరిత్ర సృష్టించిన అశ్విన్.. 36 ఏళ్ల రికార్డ్ బద్దలు!

టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సెంచరీతో సత్తా చాటిన అశ్విన్.. సుదీర్ఘ ఫార్మాట్‌లో 6వ శతకాన్ని అందుకున్నాడు. అంతేకాకుండా చెన్నై వేదికగా వరుసగా రెండో సెంచరీ నమోదు చేశాడు. ఇదే వేదికపై అశ్విన్ నాలుగు సార్లు ఐదు వికెట్ల ఘనతలను అందుకున్నాడు. ఈ క్రమంలోనే అతను 36 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టాడు.

చెన్నై వేదికగా రెండు శతకాలతో పాటు అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న క్రికెటర్‌గా అశ్విన్ నిలిచాడు. ఈ క్రమంలో దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ రికార్డ్‌ను అశ్విన్ అధిగమించాడు.

IND vs BAN Ravichandran Ashwin Creates History After He Becomes First Player In 36 Years

1988లో వెస్టిండీస్‌తో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో శతకం సాధించిన కపిల్ దేవ్.. ఈ వికెట్‌పై రెండు శతకాలతో పాటు రెండు సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న బౌలర్‌గా రికార్డుకెక్కాడు. గత 36 ఏళ్లుగా ఈ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది. కానీ తాజాగా అశ్విన్ సెంచరీతో అధిగమించాడు.

ఓకే వేదికగా మల్టిపుల్ ఐదు వికెట్ల ఘనతతో పాటు సెంచరీలు నమోదు చేసిన నాలుగో క్రికెటర్‌గా అశ్విన్ నిలిచాడు. ఈ జాబితాలో కపిల్ దేవ్, ఇయామ్ బోతమ్, క్రిస్ కైర్న్స్, గారీ సోబెర్స్ ఉన్నారు.

కపిల్ దేవ్ -చెన్నై(2 శతకాలు, రెండు సార్లు ఐదు వికెట్ల ఘనత)

ఇయాన్ బోతమ్-లీడ్స్(2 శతకాలు, మూడు సార్లు ఐదు వికెట్ల ఘనత)

క్రిస్ కైర్న్స్-ఆక్లాండ్(2 శతకాలు, రెండు సార్లు ఐదు వికెట్ల ఘనత)

గారీ సోబెర్స్-లీడ్స్(2 శతకాలు, రెండు సార్లు ఐదు వికెట్ల ఘనత)

అశ్విన్-చెన్నై(2 శతకాలు, నాలుగు సార్లు ఐదు వికెట్ల ఘనత)

తొలి ప్లేయర్‌గా అశ్విన్ రికార్డ్..
క్రికెట్ చరిత్రలోనే 20 సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు, 30 సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న తొలి ప్లేయర్‌గా అశ్విన్ నిలిచాడు.

Story first published: Friday, September 20, 2024, 17:17 [IST]
Other articles published on Sep 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+