న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు పాకిస్థాన్ నటి సెహర్ షిన్వారి బంపర్ ఆఫర్ ఇచ్చింది. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్‌తో గురువారం జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధిస్తే.. ఆ దేశ కుర్రాడితో డేటింగ్ చేస్తానని ప్రకటించింది. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.
'అల్లా దయంతో మా బంధువైన బంగ్లాదేశ్ జట్టు భారత జట్టుపై ప్రతీకారం తీర్చుకుంటుందని ఆశిస్తున్నాను. బంగ్లాదేశ్.. భారత జట్టును ఓడిస్తే నేను ఢాకా వెళ్లి బంగ్లా అబ్బాయితో ఫిష్ డిన్నర్ డేట్ చేస్తాను.'అని సెహర్ షిన్వారి రాసుకొచ్చింది. ఈ ట్వీట్‌పై భారత అభిమానులతో పాటు పాకిస్థాన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

ఇదేం పిచ్చి అని, ఫాలోవర్లను పెంచుకునేందుకు.. గుర్తింపు కోసం ఇంత దిగజారాలా? అని ప్రశ్నిస్తున్నారు. ఆటలో గెలుపు ఓటములు సహజమేనని, అభిమానులను ఆకట్టుకునేందుకు ఇంతలా దిగజారి మాట్లాడాలా? అని మండిపడుతున్నారు. ఈ ట్వీట్‌తో ఒక్కసారిగా ఇరు దేశాల దృష్టిని ఆకర్షించిన సెహర్ షిన్వారి గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు.
పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌లో పుట్టిన సెహర్ షిన్వారి.. సోషల్ యాక్టివిస్ట్. ఆమెకు తన పేరిట ఓ యూట్యూబ్ చానెల్ కూడా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 30 వేల ఫాలోవర్లు ఉన్నారు. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చేపట్టిన చంద్రయాన్ -3 ప్రయోగం సక్సెస్‌పై కూడా సెహర్ షిన్వారి స్పందించింది.

పాకిస్థాన్ ఈ తరహా ప్రయోగం చేసి సక్సెస్ సాధించాలంటే మరో రెండు-మూడు దశాబ్దాలు పడుతుందని సొంత దేశంపై వ్యంగ్యస్త్రాలు సంధించింది. అప్పుడే ఆమెపై తీవ్ర ట్రోలింగ్ జరగ్గా.. తాజా ట్వీట్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది.
ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ జరగనుంది. పుణె వేదికగా ఈ మ్యాచ్ జరగనుండగా.. ఇప్పటికే ఇరు జట్లు అక్కడికి చేరుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఇక గత శనివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ పరాజయం నేపథ్యంలో పాక్ అభిమానులు రగిలిపోతున్నారు. భారత్ ఓటమి కోసం ఎదురు చూస్తున్నారు.