టీమిండియా యువ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 70 ప్లస్ రన్స్‌తో పాటు 2 వికెట్లు తీసిన తొలి భారత ఆల్‌రౌండర్‌గా చరిత్రకెక్కాడు. బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన రెండో టీ20లో నితీష్ కుమార్ రెడ్డి ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 86 పరుగుల తేడాతో విజయం సాధించగా.. నితీష్‌కుమార్ రెడ్డి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
బ్యాటింగ్‌లో 74 పరుగులు చేసిన నితీష్ కుమార్ రెడ్డి.. బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. దాంతో ఈ ఘనతను అందుకున్న తొలి భారత ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. అరంగేట్రం చేసిన రెండో టీ20లోనే బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో సత్తా చాటిన నితీష్ కుమార్ రెడ్డికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. నితీష్ కుమార్ రెడ్డి(34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 74), రింకూ సింగ్(29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53)విధ్వంసకర హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. హార్దిక్ పాండ్యా(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) కూడా దూకుడుగా ఆడాడు.
బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ షకీబ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ రెండేసి వికెట్లు తీయగా.. రిషద్ హోస్సేన్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 135 పరుగులు చేసి ఓటమిపాలైంది. మహ్మదుల్లా(39 బంతుల్లో 3 సిక్స్‌లతో 41) మినహా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ, నితీష్ కుమార్ రెడ్డి రెండేసి వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తీ, అభిషేక్ శర్మ, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ తలో వికెట్ తీసారు. ఈ విజయంతో టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. చివరి టీ20 హైదరాబాద్ వేదికగా శనివారం దసరా పండుగ రోజున జరగనుంది.