టీమిండియా యువ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. తన రెండో అంతర్జాతీయ మ్యాచ్‌లోనే ప్రత్యర్థి బౌలర్లను చెడుగుడు ఆడాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టీ20లో నితీష్ కుమార్ రెడ్డి 34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 74 పరుగులు చేశాడు.
టీమిండియా మేనేజ్‌మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ సిరీస్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన నితీష్ కుమార్ రెడ్డి.. ఒత్తిడి కారణంగా తొలి మ్యాచ్‌లో కాస్త తడబడ్డాడు. అయినా టీమ్‌మేనేజ్‌మెంట్ అతనికి మరో అవకాశం ఇచ్చింది. ఈ ఛాన్స్‌ను నితీష్ కుమార్ రెడ్డి రెండు చేతుల అందిపుచ్చుకున్నాడు.

41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత జట్టును తనదైన బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. క్రీజులో కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్న నితీష్ కుమార్ రెడ్డి.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మహ్మదుల్లా వేసిన 9వ ఓవర్‌లో లాంగాన్ దిశగా భారీ సిక్సర్ బాది హిట్టింగ్‌ను మొదలుపెట్టిన నితీష్ కుమార్ రెడ్డి.. రిషద్ హుస్సేన్ బౌలింగ్‌లో మరో రెండు భారీ సిక్సర్లు బాదాడు.
ముస్తాఫిజురు బౌలింగ్‌లో మరో సిక్స్ కొట్టిన నితీష్ కుమార్ రెడ్డి.. టస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో బౌండరీ బాది 27 బంతుల్లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత ధాటిగా ఆడిన నితీష్.. మెహ్‌దీస్ హసన్ వేసిన 13వ ఓవర్‌లో వరుసగా 6, 4, 2, 6, 6 బాది 26 పరుగులు పిండుకున్నాడు.
విధ్వంసకర బ్యాటింగ్‌తో సెంచరీ చేసేలా కనిపించిన నితీష్ కుమార్‌ను ముస్తాఫిజుర్ ఔట్ చేశాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అతను క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం నితీష్ కుమార్ బ్యాటింగ్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. తెలుగోడి ఊచకోత అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
NITISH KUMAR REDDY - The brute force of six hitting. 🥶 pic.twitter.com/UtDAfXbbiI
— Johns. (@CricCrazyJohns) October 9, 2024
నితీష్ కుమార్ రెడ్డితో పాటు టీ20 సెన్సేషన్ రింకూ సింగ్(29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53)ధాటిగా ఆడటంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 221 పరుగుల భారీ స్కోర్ చేసింది. నితీష్-రింకూ నాలుగో వికెట్‌కు 108 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
హార్దిక్ పాండ్యా(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) కూడా దూకుడుగా ఆడాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ షకీబ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ రెండేసి వికెట్లు తీయగా.. రిషద్ హోస్సేన్ మూడు వికెట్లు పడగొట్టాడు.