Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN:ఆ తప్పిదమే మా కొంపముంచింది: బంగ్లాదేశ్ కెప్టెన్

మరోసారి బ్యాటింగ్ వైఫల్యంతోనే మూల్యం చెల్లించుకున్నామని బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ షాంటో తెలిపాడు. భారత్‌తో తొలి టీ20లో సరైన ఆరంభాన్ని అందుకోలేకపోయామని చెప్పాడు. భారీ స్కోర్ చేస్తేనే బౌలర్లకు పోరాడే అవకాశం లభిస్తుందని అభిప్రాయపడ్డాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గ్వాలియర్ వేదికగా ఆదివారం జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్‌ 7 వికెట్ల తేడాతో భారత్ చేతిలో ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులకు కుప్పకూలింది. మెహ్‌దీ హసన్ మీరాజ్(32 బంతుల్లో 3 ఫోర్లతో 35 నాటౌట్), నజ్ముల్ హెస్సేన్ షాంటో(25 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(3/31)‌, అర్ష్‌దీప్ సింగ్(3/14) మూడేసి వికెట్లతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించగా.. మయాంక్ యాదవ్(1/21), హార్దిక్ పాండ్యా(1/26), వాషింగ్టన్ సుందర్(1/12)తలో వికెట్ తీసారు.

IND vs BAN Najmul Hossain Shanto We didn t score many runs After India Beat Bangladesh In 1st T20I

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 11.5 ఓవర్లలో 3 వికెట్లకు 132 పరుగులు చేసి గెలుపొందింది. హార్దిక్ పాండ్యా(16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 నాటౌట్), సంజూ శాంసన్(19 బంతుల్లో 6 ఫోర్లతో 29), సూర్యకుమార్ యాదవ్(14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 29) దూకుడుగా ఆడారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహ్‌దీ హసన్ మీరాజ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌లు తలో వికెట్ తీసారు.

ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన నజ్ముల్ హోస్సేన్ షాంటో.. సరైన వ్యూహాలతో బరిలోకి దిగాల్సిన అవసరం ఉందన్నాడు. పాజిటీవ్ క్రికెట్ ఆడాలనే ప్రణాళికతో తొలి మ్యాచ్ ఆడినా.. వర్కౌట్ కాలేదన్నాడు. 'మాకు సరైన ఆరంభం దక్కలేదు. టీ20ల్లో తొలి 6 ఓవర్లు చాలా ముఖ్యం. కానీ మేం దారుణంగా విఫలమయ్యాం. సానుకూల క్రికెట్ ఆడాలనేది మా ప్రణాళిక. కానీ మేం ఎలా ఆడాలనేది తెలుసుకోవడానికి కొన్ని ఓవర్లు ఆడాల్సి వచ్చింది.

మేం సరైన ప్రణాళికలతో బరిలోకి దిగలేదనే విషయం అర్థమైంది. తదుపరి మ్యాచ్‌కు అయిన మేం మెరుగైన ప్రణాళికలతో రావాల్సి ఉంది. ముఖ్యంగా స్ట్రైక్ రోటేట్ చేయడంపై మా బ్యాటర్లు ఫోకస్ పెట్టాలి. టీ20లు అంటే హిట్టింగ్ ఒక్కటే కాదు. వికెట్లు చేతిలో ఉంటే మంచి స్కోర్ చేయవచ్చు. మేం ఎక్కువ పరుగులు చేయలేదు. బౌలింగ్‌లో రిషద్, ముస్తాఫిజుర్ రాణించారు. కానీ వారి పోరాటానికి కావాల్సిన పరుగులను మేం చేయలేదు.'అని నజ్ముల్ షాంటో చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, October 6, 2024, 22:53 [IST]
Other articles published on Oct 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+