For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs BAN: అందుకే ఈ ఘోర పరాజయం: బంగ్లాదేశ్ కెప్టెన్

పేలవ బ్యాటింగ్‌తో పాటు చెత్త బౌలింగ్‌తో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నామని బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో అన్నాడు. భారత్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో బంగ్లాదేశ్ 133 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో మూడు టీ20ల సిరీస్‌లోనూ బంగ్లాదేశ్ 0-3తో క్లీన్ స్వీప్‌కు గురైంది.

ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ను 0-2తో కోల్పోయిన బంగ్లాదేశ్.. ఒక్క విజయం లేకుండానే భారత పర్యటనను ముగించింది. ఆఖరి టీ20 పరాజయం అనంతరం మాట్లాడిన నజ్ముల్ షాంటో.. గట్టి పోటీనవ్వగలమనే నమ్మకాన్ని పెంచుకోవాలని అభిప్రాయపడ్డాడు.

Najmul Hossain Shanto says We didn t play our best cricket after India sealing a 3-0 whitewash

'మేం మా అత్యుత్తమ క్రికెట్ ఆడలేదు. మూడు మ్యాచ్‌ల్లో మా బ్యాటింగ్ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేదు. ఈ రోజు బౌలర్లంతా విఫలమయ్యారు. గట్టి పోటీని ఇవ్వగలమనే విశ్వాసం పెంచుకోవాలి. టౌహిడ్ హృదయ్ బ్యాటింగ్‌ మాకు లభించిన సానుకూలాంశం. అతను అద్భుతంగా ఆడాడు. టాపార్డర్ బ్యాటర్లు చాలా మెరుగవ్వాలి.'అని నజ్ముల్ షాంటో చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్లకు 297 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజూ శాంసన్(47 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో 111) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. చివర్లో రియాన్ పరాగ్( 13 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 34), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47) మెరుపులు మెరిపించారు.

బంగ్లాదేశ్ బౌలర్లలో తంజిమ్ హసన్ షకీబ్ మూడు వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్, మహ్మదుల్లా, టస్కిన్ అహ్మద్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులే చేసి ఓటమిపాలైంది. టౌహిడ్ హృదయ్(42 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 63 నాటౌట్) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. లిటన్ దాస్(25 బంతుల్లో 8 ఫోర్లతో 42) పర్వాలేదనిపించాడు.

భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ మూడు వికెట్లు తీయగా.. మయాంక్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి తలో వికెట్ తీసారు.

Story first published: Saturday, October 12, 2024, 23:27 [IST]
Other articles published on Oct 12, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+